అశేష జనవాహిని మధ్య కొనసాగుతున్న యువగళం పాదయాత్ర
టీడీపీ అధికారంలోకి వచ్చాక సాగర్ కాల్వల ఆధునికీకరణ చేపట్టి.. చివరి భూములకు నీరు అందిస్తాం;
టీడీపీ జాతీయ ప్రధాన కార్యద్శి నారా లోకేష్... యువగళం పాదయాత్ర కొనసాగుతోంది. ఇవాల్టితో లోకేష్ పాదయాత్ర 180వ రోజుకు చేరింది.మాచయపాలెం విడిది కేంద్రం పాదయాత్ర ప్రారంభమైంది. లోకేష్‌కు అడుగడునా ఘనంగా స్వాగతం చెబుతున్నారు ప్రజలు. పాదయాత్రలో... దారిపొడవునా.,.టీడీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అందరిని పలకరిస్తూ...ముందుకు సాగుతున్నారు లోకేష్.
పెదకూరపాడు నియోజకవర్గంలో నారా లోకేష్‌ను కలిసిన చండ్రాజుపాలెం గ్రామస్తులు తమ సమస్యలను లోకేష్‌కు విన్నవించుకున్నారు.జగన్ అధికారంలోకి వచ్చాక..ఇరిగేషన్ ప్రాజెక్టులను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు నారా లోకేష్.రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారనిసాగర్ కాల్వల ఆధునికీకరణ చేపట్టకపోవడంతో 50శాతం నీరు కూడా రైతులకు అందడం లేదని అన్నారు.టీడీపీ అధికారంలోకి వచ్చాక సాగర్ కాల్వల ఆధునికీకరణ చేపట్టి..చివరి భూములకు నీరు అందిస్తామన్నారు.
జై టీడీపీ, జై లోకేష్ నినాదాలతో పెదకూరపాడు దద్దరిల్లింది.లోకేష్‌తో సెల్ఫీలు దిగేందుకు మహిళలు, యువకులు పోటీపడ్డారు.. ఓ వైపు భుజం నొప్పి బాధిస్తున్నా అందరిని ఆప్యాయంగా పలకరిస్తూ వారితో సెల్ఫీలు దిగారు.యువనేతను చూసేందుకు భారీగా తరలివచ్చారుప్రజలు. స్థానిక కాలనీలోని స్థానికులతో మాటామంతీ నిర్వహించారు.