వైసిపి పాలనలో దోచుకోవడానికి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఇంత దారుణంగా వాడుకుంటారా అని షాక్ అవుతున్నారు భక్తులు. ఎందుకంటే వైసిపి పాలనలో జరిగిన అరాచకాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇప్పటికే తిరుమలలో లడ్డు కల్తీ నెయ్యి కేసు, పరకామణి కేసులు వెలుగు చూశాయి. వీటికి తోడు ఇప్పుడు పట్టు శాలువాలకు బదులు పాలిస్టర్ శాలువాల కుంభకోణం సంచలనం రేపుతోంది. వైసిపి ఐదేళ్ల పాలనలో ఈ శాలువాల స్కామ్ జరిగింది. పట్టు శాలువాలకు బదులు పాలిస్టర్ శాలువాలను తెప్పించి ప్రముఖులు, విఐపి గెస్ట్ లకు కప్పారు. 300 కూడా విలువ చేయని శాలువాలను 1400 కొని అక్రమాలకు తెర లేపారు వైసిపి నేతలు, అప్పటి టీటీడీ పాలకవర్గం. ఇదంతా వైసిపి అగ్ర నేతల కనుసన్నల్లోనే జరిగిందని ఆరోపణలు వస్తున్నాయి.
శాలువాల పరిమాణంలో ఉండాల్సిన రూల్స్ ను పాటించలేదు. అలాగే శాలువాల మీద తెలుగు, సంస్కృతంలో ఉండాల్సిన ఓం నమో వెంకటేశాయ ముద్ర కూడా లేదు. సిల్క్ బోర్డు లేబుల్ లేదు. కేవలం పాలిస్టర్ శాలువాలను తీసుకొచ్చి అక్రమాలకు ఐదేళ్లలో దాదాపు 70 నుంచి 90 కోట్ల దాకా అవినీతి జరిగిందని ప్రస్తుత టీటీడీ బోర్డు తెలిపింది. బెంగళూరు, ధర్మవరం సిల్క్ బోర్డులు టీటీడీ పంపిన శాలువాలు అన్ని పాలిస్టర్ వే అని తేల్చి చెప్పడంతో దీనిపై ఏసీబీ విచారణ జరిపిస్తామంటున్నారు టీటీడీ బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడు గారు.
దీంతో వైసీపీలో మళ్ళీ వణుకు మొదలైంది. ఇప్పటికే కల్తి నెయ్యి, పరకామణి కేసులు వాళ్ళ మెడకు చుట్టుకుంటున్నాయి. ఇప్పుడు ఇంకో కేసు కూడా బయటకు రావడంతో ఈసారి ఎవరెవరు దొరికిపోతారో అని వాళ్ళలో వాళ్లే టెన్షన్ పడుతున్నారంట. అయినా వాళ్లకు ఇవేవీ పెద్ద కేసులుగా కనిపించవు కాబోలు. ఎందుకంటే పరకామణి కేసుని జగన్ ఎంత చిన్నగా చెప్పారో చూశాం. ఇక కల్తీ నెయ్యి కేసు అంటే అసలు లెక్కే లేదన్నట్టు మాట్లాడారు. అలాంటివారికి ఈ కేసు అసలు లెక్కలోకి కూడా వస్తుందో లేదో తెలియదు. వాళ్లకు ఇలాంటివన్నీ కామన్ అని చెప్పేస్తారేమో. 70 కోట్లే కదా అదేమన్నా పెద్ద విషయమా అంటారేమో. జగన్ దృష్టిలో పెద్ద కేసు అంటే కనీసం వేలకోట్లలో అయినా ఉండాలేమో. మరి దీనిపై ఏమంటారో చూద్దాం.