MLA Amilineni : కళ్యాణదుర్గం మున్సిపాలిటీ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ అవసరం

Update: 2025-08-22 11:44 GMT

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో మున్సిపాలిటీ భవనంలో కళ్యాణదుర్గం మున్సిపాలిటీ అభివృద్ధి 2047ను దృష్టిలో ఉంచుకుని మాస్టర్ ప్లాన్ పై సలహాలు, సూచనలు తెలుసుకునేందుకు నిర్వహించిన సమావేశానికి ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు పాల్గొన్నారు కళ్యాణదుర్గం మాస్టర్ ప్లాన్ ను కమిషనర్ వంశీకృష్ణ ఎమ్మెల్యే హామిలినేని సురేంద్రబాబుకు మరియు విచ్చేసిన కళ్యాణదుర్గం ప్రజలకు పూర్తి ప్లాన్ గురించి వివరించారు ఈ సందర్బంగా ఎమ్మెల్యే అమిలినేని మాట్లాడుతూ.. గత ఐదేళ్లలో వైసీపీ నాయకులు అరాచక పాలనతో కళ్యాణదుర్గం మున్సిపాలిటీలో ఎక్కడపడితే అక్కడ భూములను కబ్జాలు, ఆక్రమణలు చేయడమే కాకుండా ఒక్కో స్థలాన్ని ఇద్దరికీ, ముగ్గురికి అమ్ముకున్నారని అలాంటి వారిని దూరంగా పెట్టాల్సిన బాధ్యత మనందరిపైన ఉంటుందని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు తెలిపారు కబ్జాలు, ఆక్రమణలు చేసే వారిపై ద్రుష్టిలో పెట్టుకుని వారిని అడ్డుకోవాలని, పట్టణ అభివృద్ధికి ఎవరు ఎలాంటి సూచనలు అయిన చేయవచ్చని తెలిపారు కళ్యాణదుర్గం పట్టణంలో క్రీడా మైదానం కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకువచ్చి నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామని, 184 కోట్లతో పట్టణానికి శాశ్వత తాగునీటి పరిష్కారం చేస్తామని, పట్టణంలో ఇంటర్నల్ రహదారులతో పాటు ప్రధాన రహదారులు, ఔటర్ రింగ్ రోడ్డులు ఏర్పాటుఅవసరముందని, 2047 దృష్టిలో పెట్టుకుని పట్టణ ప్రణాళికలు తయారు చేస్తుస్తున్నామని తెలిపారు చంద్రబాబు నాయుడు 20 ఏళ్ల పాటు కొనసాగేలా చూడాల్సిన బాధ్యత అందరిదన్నారు.

Tags:    

Similar News