MEET: కృష్ణా బోర్డు అక్కడ.. గోదావరి బోర్డు ఇక్కడ

ఢిల్లీలో ముఖమంత్రుల భేటీ.. నీటి పంపకాలు, ప్రాజెక్టులపై చర్చ.. సుహృద్బావ వాతావరణంలో సమావేశం.. బనకచర్లపై కమిటీ;

Update: 2025-07-17 03:00 GMT

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నీటి పంపకాలు, ప్రాజెక్టులకు సంబంధించి ఢి- వేదికగా కీలక సమావేశం జరిగింది. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆ- ర్ పాటిల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో ఏపీ సీఎం చం- ద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల నీ- టిపారుదల శాఖ మంత్రులు ఉత్తమ్, నిమ్మల రామానాయుడు, ఏపీ, తెలంగాణ సీఎస్లు, నీటిపారుదల శాఖ కార్యదర్శులు హాజరయ్యా - రు. రెండు రాష్ట్రాల మధ్య నీటి వివాదాల ఎజెండాగా ఈ సమావేశం జరిగింది. గోదావరి బనకచర్ల ప్రాజెక్టును సింగిల్ పాయింట్ ఎజెండాగా ఏపీ ప్రతిపాదించింది. 13 అంశాలను ఎజెండాలో ప్రతిపాదించిన తె- లంగాణ ప్రభుత్వం .. పాలమూరు- రంగారెడ్డి, డిండి, సమ్మక్క సాగర్, ప్రాణహిత చేవెళ్ల సహా.. కీలక ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వాలని ప్రతిపాదనల్లో పేర్కొంది. దాదాపు గంటన్నరపాటు ఈ సమావేశం జరి- గింది. తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు సంబంధించిన ఉమ్మడి ప్రాజెక్టులు సహా.. గోదావరి పరివాహక ప్రాంతంలోని ప్రాజెక్టులపై టెలీ మెట్రీ విధా- నాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. తద్వారా ఎవరు ఎంత నీటి- ని వాడుతున్నారన్నది లెక్కలు తేలనుంది. గతంలో కేసీఆర్ దీనిని వ్య- తిరేకించగా.. ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి ఓకే చెప్పారని తెలిసింది. ఇక, ఏపీకి కీలకమైన శ్రీశైలం ప్రాజెక్టు మరమ్మతులు, నీటి విడుదల, స్టోరేజీ అంశాలపై ఏపీ చర్చించింది.

బనకచర్లపై కమిటీ

తెలుగు రాష్ట్రాల నీటి అంశాలపై ఏపీ, తెలంగాణ సీఎంల చర్చలు స్నేహపూర్వక వాతావరణం- లో జరిగాయని ఏపీ జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. గోదావరి, కృష్ణా నదుల నీటి కేటాయింపులపై చర్చించామన్నారు. "స్నేహపూర్వక వాతావరణంలో చర్చ - లు జరిగాయి. రిజర్వాయర్ల నుంచి కాలువల్లోకి వెళ్లే చోట్ల టెలిమెట్రీల ఏర్పాటుకు అంగీకారం కుదిరింది. శ్రీశైలం ప్రాజెక్టు మరమ్మతులు, రక్షణ చర్యలపై చర్చించాం. ఆ ప్రాజెక్టును కాపాడుకో- వాలని ఇద్దరు సీఎంలు నిర్ణయించారు. కృష్ణా బోర్డు అమరావతిలో.. గోదావరి బోర్డు హైదరా- బాద్లో ఉండేలా నిర్ణయం జరిగింది. రెండు రాష్ట్రాలు ఇచ్చిన ప్రతిపాదనల్లో సాంకేతిక అంశా- లు ఉన్నాయి. కృష్ణా, గోదావరి జిలాలు.. బనకచర్లపై సోమవారంలోపు కమిటీ ఏర్పాటు చే యాలని నిర్ణయించాం. దీంతో రెండు రాష్ట్రాలకు కూడా న్యాయం జరుగుతుందని భావిస్తు- న్నాం" అని నిమ్మల రామానాయుడు తెలిపారు. బనకచర్ల ప్రాజెక్టుపై సోమవారం లోపు ఒక కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. ఏపీ బనకచర్ల ప్రాజెక్టు వి- షయాన్ని సీరియస్ గా తీసుకుంది. కానీ, తెలంగాణ మాత్రం గోదావరి బోర్డు సహా.. నీటి కేటా- యింపులు.. తమ రాష్ట్రంలో కొత్తగా నిర్మించే ప్రాజెక్టుల విషయాన్ని పరిగణనలోకి తీసుకుంది.

Tags:    

Similar News