AP: మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల
16,347 పోస్టుల భర్తీ... నేటి నుంచే దరఖాస్తుల స్వీకరణ;
మెగా డీఎస్సీ-2025 నోటిఫికేషన్‌ను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 16,347 ఉపాధ్యాయ ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేయనుంది. నేటి(ఆదివారం) నుంచి మే 15వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు. మెగా డీఎస్సీకి సంబంధించిన పూర్తి సమాచారం, సంబంధిత జీవోలు, ఉపాధ్యాయ పోస్టుల వివరాలు, పరీక్షా షెడ్యూలు, సిలబస్, సహాయ కేంద్రాల వివరాలను వెల్లడించింది. టీచర్ పోస్టుల వివరాలు, పరీక్ష షెడ్యూల్ తో పాటు దరఖాస్తు ప్రాసెస్ వివరాలను వెబ్ సైట్ లో పొందుపరిచారు. ఏప్రిల్ 20వ తేదీ నుంచే అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవచ్చు. ఫీజుల చెల్లింపు, దరఖాస్తుల స్వీకరణకు మే 15వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు.
ఎన్ని పోస్టులంటే
ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 16,347 ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అయితే ఇందుకు సంబంధించిన సిలబస్ వివరాలను విద్యాశాఖ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఎస్టీటీ, స్కూల్ అసిస్టెంట్ తో పాటు ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టుల సిలబస్ వివరాలను పేర్కొంది. అభ్యర్థులు ముందుగా https://apdsc.apcfss.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి. హోం పేజీలో కనిపించే సబ్జెక్ట్స్ అండ్ సిలబస్ ఆప్షన్ పై నొక్కాలి. ఇక్కడ “MEGA DSC 2025 Suggestive Syllabus” అని వస్తుంది. దాని పక్కన వ్యూ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తే పీడీఎఫ్ ఓపెన్ అవుతుంది. ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ ద్వారా ఏపీ మెగా డీఎస్సీ సిలబస్ కాపీని పొందవచ్చు.
స్కూల్ అసిస్టెంట్ ఇలా..
ఏపీ మెగా డీఎస్సీలోని ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్ రాత పరీక్షను మొత్తం 80 మార్కులకు నిర్వహిస్తారు. జనరల్ నాల్డెజ్ కు 8 మార్కులు, Perspectives in Educationకు 4 మార్కులు, ఎడ్యుకేషనల్ సైకాలజీ 8 మార్కులు ఉంటాయి. కంటెంట్ అండ్ మెథడలాజీకి 60 మార్కులు (40+20) ఉంటాయి. మరో 20 మార్కులు టెట్ స్కోర్ నుంచి వెయిటేజీ ఇస్తారు. పీజీటీ, ప్రిన్సిపాల్ పోస్టులకు 100 మార్కులకు గాను పరీక్ష నిర్వహిస్తారు. ఇందుకు సంబంధించిన సిలబస్ వివరాలను కూడా https://apdsc.apcfss.in/ వెబ్ సైట్ లో ఉంచారు.