Megastar Chiranjeevi : సీఎం సహాయనిధికి కోటి విరాళం.. స్వయంగా అందించిన మెగాస్టార్..

Update: 2025-08-25 06:45 GMT

ఏపీ సీఎం సహాయ నిధికి కోటి రూపాయల విరాళాన్ని అందించారు మెగాస్టార్ చిరంజీవి. సీఎం చంద్రబాబును స్వయంగా కలిసి కోటి రూపాయల చెక్కును అందించారు. ఏపీ లో కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం పని చేస్తుందన్నారు మెగాస్టార్. తన వంతు బాధ్యతగా అత్యవసర పరిస్థితుల్లో బాధితులను ఆదుకునేందుకు ఈ నిధి ఉపయోగపడుతుందని చిరంజీవి తెలిపారు. కాగా చిరంజీవి కోటి రూపాయల విరాళం అందించడం పట్ల సీఎం చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. “చిరంజీవి ఎప్పుడూ సామాజిక బాధ్యతకు ప్రాధాన్యం ఇస్తారు. ప్రజల కోసం, సేవా కార్యక్రమాల కోసం ఆయన చేసే కృషి ప్రశంసనీయం” అని చంద్రబాబు పేర్కొన్నారు. ఇక ఈభేటీకి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో... “చిరు రియల్ హీరో” అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.

Tags:    

Similar News