రాయలసీమ బిడ్డ అని చెప్పుకునే జగన్ ఇక్కడ సాగునీటి రంగాన్ని పట్టించుకోలేదని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. అగ్రికల్చర్, హార్టికల్చర్, డ్రిప్ ఇరిగేషన్‌ను గాలికొదిలేశారని దుయ్యబట్టారు. కర్నూలు ఉల్లి మార్కెట్‌ను తనిఖీ చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. గతేడాది అక్టోబర్‌లో మార్కెట్‌కు 52వేల టన్నుల ఉల్లి వస్తే ప్రస్తుతం 2.5 లక్షల టన్నులు వచ్చిందన్నారు. ఈసారి రైతులు అధిక ధరను పొందారని చెప్పారు. గత ప్రభుత్వంలో హార్టికల్చర్, డ్రిప్ ఇరిగేషన్ వంటి అన్నింటినీ గాలికొదిలేశారని విమర్శించారు. ఉల్లి రైతుకు ఒక్క రూపాయి కూడా నష్టం జరగకూడదని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. వినియోగదారుడికి భారం కాకుండా మేలు జరిగేలా ఎన్డీయే కూటమి పని చేస్తోందని చెప్పా