Perni Nani : కిరాయికి రాజకీయ పార్టీ పెట్టిన వ్యక్తి పవన్‌కళ్యాణ్..!
Perni Nani : దేశంలోనే తొలిసారి కిరాయికి రాజకీయ పార్టీ పెట్టిన వ్యక్తి పవన్‌కళ్యాణ్ అని ఘాటుగా విమర్శించారు మంత్రి పేర్ని నాని.;
Perni Nani : దేశంలోనే తొలిసారి కిరాయికి రాజకీయ పార్టీ పెట్టిన వ్యక్తి పవన్‌కళ్యాణ్ అని ఘాటుగా విమర్శించారు మంత్రి పేర్ని నాని. ఆన్‌లైన్‌లో సినిమా టిక్కెట్ల అమ్మకంపై మరోసారి నిర్మాతల బృందంతో భేటీ అయ్యారు. ప్రభుత్వ నిర్ణయానికి తామంతా అనుకూలమని నిర్మాతలు చెప్పినట్లు పేర్ని నాని తెలిపారు. షామియానా షాపు మాదిరి పార్టీని మార్చిన ఘనుడు పవన్ కళ్యాణ్ అని నిప్పులు చెరిగారు. ఇండస్ట్రీ అంతా ఒకే మాటపై ఉన్నట్లు సీఎం జగన్‌కు చెప్పాలని నిర్మాతలు కోరినట్లు తెలిపారు. ఇప్పటికే పోర్టల్స్ నుంచి అన్‌లైన్‌లో టికెట్ల అమ్మకం జరుగుతోందని... కొన్ని చోట్ల 90 శాతం అన్‌లైన్‌లో అమ్మకాలు జరుగుతున్నాయన్నారు. తమతో చెప్పకుండా ఒక నటుడు మాట్లాడటాన్ని నిర్మాతలు వ్యతిరేకిస్తున్నారని పేర్ని నాని అన్నారు.