అధిక ధరలకు సినిమా టికెట్లు అమ్మకూడదన్నదే తమ ప్రభుత్వ లక్ష్యం : పేర్ని నాని
Perni Nani : అధిక ధరలకు సినిమా టికెట్లు అమ్మకూడదన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి పేర్నినాని. సినిమాటోగ్రఫి బిల్లును సభలో ప్రవేశపెట్టిన సందర్భంగా ఆయన మాట్లాడారు.;
Perni Nani : అధిక ధరలకు సినిమా టికెట్లు అమ్మకూడదన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి పేర్నినాని. సినిమాటోగ్రఫి బిల్లును సభలో ప్రవేశపెట్టిన సందర్భంగా ఆయన మాట్లాడారు. దీంతో ఆన్‌లైన్‌లో సినిమా టికెట్ల విక్రయానికి మార్గం సుగమమైందన్నారు. ఇప్పటివరకు థియేటర్ యజమానుల ఇష్టానుసారం టికెట్ల విక్రయాలు జరిగేవని, ప్రజలను దోచుకునే పరిస్థితి నియంత్రించేందుకే ఆన్‌లైన్ విధానం తీసుకోచ్చామన్నారు. బస్సు,రైలు,విమాన టికెట్ల తరహాలోనే సినిమా టికెట్ల అమ్మకాలు జరిగేలా చూస్తామన్నారు. రాష్ట్రంలోని 11 వందల థియేటర్లలో ఆన్‌లైన్ టికెట్ విక్రయాలు చేపడతామన్నారు. బెనిఫిట్ షోలకు అవకాశం లేకుండా నిబంధనలు రూపొందించినట్లు చెప్పారు. జీవో 35 ప్రకారం బెనిఫిట్ షోలకు ప్రత్యేక అనుమతి ఉంటుందని...ఛారిటీస్ కోసం మాత్రమే వీటికి అనుమతిస్తామన్నారు. చట్టప్రకారం ఇక పై రోజుకు నాలుగు ఆటలు మాత్రమే వేయాల్సి ఉంటందన్నారు. ప్రభుత్వం టికెట్లు విక్రయించే పోర్టల్‌ను మాత్రమే నిర్వహిస్తుందని...వ్యాపారం చేయబోదన్నారు.