తిరుపతి రైల్వే స్టేషన్‌లో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి: పీయూష్ గోయల్
తిరుమలలో కొవిడ్ నిబంధనలను పాటిస్తూ పరిశుభ్రంగా ఉంచడంపై అధికారులను పీయూష్ గోయల్ అభినందించారు;
తిరుపతి రైల్వే స్టేషన్‌లో పలు అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. తిరుపతి, ఇతర ప్రాంతాల మధ్య రైళ్లు ఎక్కువ సంఖ్యలో నడిచేలా అదనపు ట్రాకులను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఆత్మనిర్భర్ దిశగా భారత్ అడుగులు వేస్తోందని, ఇండియా సామర్థ్యం ఏంటో ప్రపంచం చూస్తోందని అన్నారు. ఈ ఉదయం శ్రీవారిని దర్శించుకున్న పీయూష్ గోయల్.. తిరుమలలో కొవిడ్ నిబంధనలను పాటిస్తూ పరిశుభ్రంగా ఉంచడంపై అధికారులను అభినందించారు.