వైఎస్సార్సీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి ఊరట లభించింది. లిక్కర్ కుంభకోణంలో అరెస్టయిన ఆయనకు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు వీలుగా విజయవాడ ఏసీబీ కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.ఈ నెల 11న సాయంత్రం 5 గంటలలోపు తిరిగి రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో సరెండర్ కావాలని.. రూ.50వేల చొప్పున రెండు పూచీకత్తులతో ష్యూరిటీని కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. ఇదిలా ఉంటే ఏసీబీ కోర్టులో రెగ్యులర్ బెయిల్పై విచారణ కొనసాగుతోంది. మిథున్ రెడ్డి ప్రస్తుతం రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో ఉన్నారు. ష్యూరిటీలు సమర్పించిన తర్వాత బెయిల్ పేపర్లు తీసుకుని జైల్లో సమర్పిస్తే మిథున్ రెడ్డి విడుదలవుతారు. ఇవాళ శనివారం, రేపు ఆదివారం కావడంతో ఈలోపు ఈ ప్రక్రియ పూర్తవుతుందా లేదా అన్నది చూడాలి.. ఒకవేళ ఈరోజు ఈ ప్రక్రియ పూర్తికాకపోతే సోమవారం విడుదలయ్యే అవకాశం ఉంటుంది.