MLA Balakrishna : మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్న ఎమ్మెల్యే బాలకృష్ణ..!
MLA Balakrishna : సినీ నటుడు, హిందూపురం టీడిపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు.;
MLA Balakrishna : సినీ నటుడు, హిందూపురం టీడిపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. కోవిడ్ రోగులకు 20 లక్షల రూపాయల విలువైన కిట్లను అందజేశారు. ఈ కోవిడ్ కిట్లను హైదరాబాదు నుంచి హిందూపురంకి పంపించారు బాలకృష్ణ. ప్రస్తుతం కరోనా వలన ఎక్కడికి వెళ్లలేని పరిస్థితుల నేపథ్యంలో బాలకృష్ణ హిందూపురం నియోజకవర్గంకి వెళ్ళలేదు. దీంతో స్థానిక టీడీపీ నేతలు హిందూపురంలో కోవిడ్ బాధితులకు కిట్లు పంపిణీ చేశారు. ఇటీవల హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి 15 లక్షల విలువైన మందులు అందించిన బాలకృష్ణ .. గతేడాది కోటి రూపాయలతో కరోనా బాధితులను ఆదుకున్నారు. హిందూపురం నియోజక వర్గ ప్రజల అభ్యున్నతే ఎమ్మెల్యే బాలకృష్ణ ధ్యేయమని స్థానిక టీడీపీ నేతలన్నారు.