చిత్తూరు వైసీపీ నేతల మధ్య మళ్లీ బయటపడ్డ విభేదాలు.. !

వైసీపీ చిత్తూరు నేతల మధ్య విభేదాలు బయటపడ్డాయి. పార్టీలోని కొందరు నేతలపై ఎమ్మెల్యే రోజా తీవ్ర విమర్శలు చేశారు. పార్టీలో ఉంటూ పార్టీకి ద్రోహం చేస్తున్నారని మండిపడ్డారు.;

Update: 2021-03-10 13:15 GMT

వైసీపీ చిత్తూరు నేతల మధ్య విభేదాలు బయటపడ్డాయి. పార్టీలోని కొందరు నేతలపై ఎమ్మెల్యే రోజా తీవ్ర విమర్శలు చేశారు. పార్టీలో ఉంటూ పార్టీకి ద్రోహం చేస్తున్నారని మండిపడ్డారు. నగరిలో ఓటు వేసిన అనంతరం మాట్లాడిన రోజా.. ఈడిగ కార్పొరేషన్‌ ఛైర్‌పర్సన్‌ కె.జె.శాంతి, కె.జె.కుమార్‌పై అసహనం వ్యక్తం చేశారు. ఇదిప్పుడు చర్చనీయాంశమైంది. కొద్ది వారాల కిందట కూడా రోజా ఇలానే అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రివిలైజ్ కమిటీ ముందు కూడా తన బాధ చెప్పుకుని కన్నీరు పెట్టారు. అదింకా మర్చిపోకముందే మరోసారి పార్టీలో వ్యతిరేక వర్గంపై ఓ రేంజ్‌లో ఫైరైపోయారు. 

Tags:    

Similar News