ఏపీ హైకోర్టులో ఎమ్మెల్యే ఉదయభానుకు చుక్కెదురు..!

జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభానుకు హైకోర్టులో చుక్కెదురైంది. ఉదయభానుపై ఉన్న పది కేసులు ఉపసంహరించుకుంటూ ప్రభుత్వం ఇచ్చిన జీవోను హైకోర్టు తప్పుపట్టింది.

Update: 2021-11-12 09:47 GMT

జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభానుకు హైకోర్టులో చుక్కెదురైంది. ఉదయభానుపై ఉన్న పది కేసులు ఉపసంహరించుకుంటూ ప్రభుత్వం ఇచ్చిన జీవోను హైకోర్టు తప్పుపట్టింది. ప్రభుత్వ జీవోను సవాల్‌ చేస్తూ ఏపీ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షులు కృష్ణాంజనేయులు వేసిన పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన ధర్నాసనం.. ఒక్క జీవోతో పది కేసులు ఎలా ఉపసంహరించుకుంటారని ప్రశ్నించింది. దీనిపై ప్రభుత్వం జీవో ఇవ్వాల్సిన అవసరం ఏమిటని ధర్మాసనం నిలదీసింది. ఎమ్మెల్యే ఉదయభాను, హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీసీకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. మూడువారాల్లో కౌంటర్‌ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. పిటిషనర్‌ తరపున న్యాయవాది జడ శ్రావణ్‌ కుమార్‌ వాదనలు వినిపించారు.

Tags:    

Similar News