పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను అవినీతిమయం చేసేందుకు సీఎం జగన్ ప్రయత్నిస్తున్నారని టీడీపీ నేత కూన రవికుమార్ ఆరోపించారు. వైసీపీ నేతలు తప్పుడు ధృవ పత్రాలతో ఓట్లు నమోదు చేయించారని విమర్శించారు. తప్పుడు ధృవపత్రాలతో ఓటర్లుగా నమోదైన వారిపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని రవికుమార్ డిమాండ్ చేశారు. ఓటర్ల బ్యాంకు ఎకౌంట్లకు డబ్బులు పంపి ప్రలోభాలకు గురిచేస్తున్నారని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల పేరుతో మంత్రులు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు.