Raghurama Krishnaraju : ఎంపీ రఘురామ విడుదల మరింత ఆలస్యం..!
Raghurama Krishnaraju : వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు విడుదల మరింత ఆలస్యం కానుంది. నాలుగు రోజుల తర్వాత ఆర్మీ ఆసుపత్రి నుంచి రఘురామ డిశ్చార్జ్ కానున్నారు.;
Raghurama Krishnaraju : వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు విడుదల మరింత ఆలస్యం కానుంది. నాలుగు రోజుల తర్వాత ఆర్మీ ఆసుపత్రి నుంచి రఘురామ డిశ్చార్జ్ కానున్నారు. ఈ మేరకు ఆర్మీ ఆసుపత్రి వైద్యులు సైతం ధ్రువీకరించారు. దీనితో Cid కోర్టులో ఎంపీ తరపు లాయర్లు ష్యూరిటీ పిటిషన్ వేశారు. సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రిలో ఉన్న రఘురామకృష్ణరాజు ఆరోగ్య పరిస్థితిని మెజిస్ట్రేట్ అడిగి తెలుసుకున్నారు.
ఆస్పత్రి నుంచి డిశ్చార్జి సమ్మరీ కోరారు. ఎంపీకి మరో నాలుగు రోజులు వైద్యం అవసరమని ఆర్మీ ఆసుపత్రి వైద్యులు మెజిస్ట్రేట్ కి తెలిపారు. దీంతో వైద్యులు తుది నివేదిక ఇచ్చిన తర్వాతే రఘురామ విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ నెల 21 సుప్రీంకోర్టు ఎంపీ రఘురామకృష్ణరాజుకు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది. అయితే గుంటూరులోని ట్రయల్ కోర్టులో కేసు నడుస్తోంది. దీంతో పాటు ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్న ఎంపీ విడుదలకు సబంధించిన బెయిల్ ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది.