సీఎం జగన్‌కు ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ..!
ఏపీ సీఎం జగన్ కు రఘురామకృష్ణ రాజు మరో లేఖ రాశారు. ఇవాళ లేఖలో పంచాయతీ వ్యవస్థ బలోపేతంపై దృష్టి సారించాలని ప్రభుత్వానికి సూచించారు.;
ఏపీ సీఎం జగన్ కు రఘురామకృష్ణ రాజు మరో లేఖ రాశారు. ఇవాళ లేఖలో పంచాయతీ వ్యవస్థ బలోపేతంపై దృష్టి సారించాలని ప్రభుత్వానికి సూచించారు. గ్రామ వాలంటీర్ల వ్యవస్థను ప్రవేశపెట్టి, పంచాయతీ అధికారులను నిర్వీర్యం చేసున్నారని రఘురామకృష్ణరాజు విమర్శించారు. పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేయాలని గాంధీజీ కోరితే.. మన ప్రభుత్వం ఆవ్యవస్థను లాంఛనంగా చూస్తోందని మండిపడ్డారు. సర్పంచ్‌లకు చెక్ పవర్ ఇవ్వడంపై జాప్యం ఎందుకని ప్రశ్నించారు. సర్పంచ్, ఉప సర్పంచ్కు కలిపి చెక్ పవర్ ఇవ్వడం సర్పంచ్ వ్యవస్థను బలహీన పరచడమేనని ఆయన స్పష్టం చేశారు.
ఇటీవల కాలంలో ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రజాసమస్యలపై లేవనెత్తుతూ సీఎం జగన్‌కు వరుస లేఖలను సందిస్తున్నారు. అందులో భాగంగానే ఆయన మరో లేఖ రాశారు. వైసీపీ ప్రభుత్వం తెచ్చిన జీవో నెంబర్ 2 ద్వారా .. పంచాయతీ వ్యవస్థకు పూర్తి విఘాతం ఏర్పడిందని ఆయన తెలిపారు. ఎంతో జాగ్రత్తగా ప్లాన్ చేసి వాలంటీర్లను నియమించారని.. ప్రజలు ఎన్నుకున్న వ్వవస్థకు ప్రత్యామ్నాయ వాలంటీర్లను నియమించడం ప్రజాస్వామ్యాన్ని కాలరాయడమేనని రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు.