వారిలాగే జగన్ కూడా సీఎం పదవికి రాజీనామా చేయొచ్చు! : ఎంపీ రఘురామకృష్ణరాజు

వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు సీఎం జగన్ పై మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. మాజీ సీఎంలు నీలం సంజీవరెడ్డి, జనార్థన్ రెడ్డిలా జగన్ కూడా సీఎం పదవికి రాజీనామా..

Update: 2020-11-13 10:24 GMT

వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు సీఎం జగన్ పై మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. మాజీ సీఎంలు నీలం సంజీవరెడ్డి, జనార్థన్ రెడ్డిలా జగన్ కూడా సీఎం పదవికి రాజీనామా చేయాల్సి రావొచ్చని జోస్యం చెప్పారు. రేపోమాపో కోర్టు ధిక్కరణ నోటీసులు కూడా తీసుకోవడానికి జగన్ సిద్ధంగా ఉండాలని సూచించారు.

వైసీపీ నేతలు జడ్జిల చిత్తశుద్ధిని శంకిస్తూ ప్రధాన న్యాయమూర్తికి రాసిన లేఖను బహిర్గతం చేయడం వెనుక దురుద్దేశాలు ఉన్నాయని అభిప్రాయపడ్డారు. నిజంగా న్యాయవ్యవస్థపై గౌరవం ఉంటే తమ ఫిర్యాదుపై చీఫ్ జస్టిస్ స్పందన కోసం వేచి చూసేవారని తెలిపారు. 

Tags:    

Similar News