ఏలూరు వాసులకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్న అంతుచిక్కని వ్యాధి.. వైద్యులనూ భయపెడుతోందా? బాధితులకు చికిత్స అందిస్తున్న వైద్య సిబ్బంది కూడా అదే తరహాలో ఒక్కసారిగా కళ్లు తిరిగిపడిపోవడం కలవర పెడుతోంది. సోమవారం రాత్రి ఓ నర్సు ఉన్నట్లుండి మూర్చపోయారు.. ఈ రోజు మరో వైద్యుడిది అదే పరిస్థితి.. బాధితులకు చికిత్స చేస్తున్న వారు కూడా ఇలా కళ్లు తిరిగిపడిపోతుండటంతో వైద్యసిబ్బంది బెంబేలెత్తిపోతున్నారు.. అయితే డాక్టర్లు కూడా ఇలా మూర్చపోవడానికి కారణం.. అంతుచిక్కని వ్యాధేనా..? లేక కేవలం భయంతో అలా జరుగుతోందా అన్నది ఇంకా తేలాల్సి ఉంది.. అటు సోమవారం ఏలూరు ఆస్పత్రి వద్ద విధులు నిర్వహిస్తున్న ఓ కానిస్టేబుల్ కూడా ఇదే రీతిలో ఉన్నట్టుండి కళ్లు తిరిగి పడిపోయాడు. ఈ వరుస ఘటనలపై అటు జనం.. ఇటు వైద్య సిబ్బందిలోనూ ఆందోళన వ్యక్తం అవుతోంది.