సీఎం చంద్రబాబు నాయుడు విజన్ ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా. ఇప్పటికే ఆయన విజన్ ను దేశమంతా గుర్తిస్తోంది. అందరికంటే ముందే చంద్రబాబు విజన్ ను గుర్తించి హైదరాబాద్ కు ఐటీని తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన బిల్ గేట్స్ నేడు మరోసారి ఏపీకి వచ్చారు. ఈ సందర్భంగా బిల్ గేట్స్ పర్యటనను సీఎం చంద్రబాబు చక్కగా వాడుకున్నారు. ఏపీలో ఇన్నోవేషన్లు, ప్రపంచ స్థాయి పెట్టుబడులను వివరించారు. డేటా లేక్, అవేర్ 2.0, వాట్సాప్ గవర్నెన్స్, సంజీవని ప్రాజెక్టు, రాజధాని అమరావతి ప్రాజెక్టు గురించి తెలిపారు. ప్రజలకు పౌరసేవను మరింత వేగంగా టెక్నాలజీ సాయంతో ఎలా అందిస్తున్నామనేది సీఎం చంద్రబాబు వెల్లడించారు.
అలాగే ఉండవల్లిలోని వ్యవసాయ క్షేత్రాన్ని కూడా బిల్ గేట్స్ కు చూపించారు. వ్యవసాయంలో టెక్నాలజీని ఎలా వాడుతున్నామనేది కూడా చాలా స్పష్టంగా చూపించారు. దీంతో సీఎం చంద్రబాబు విజన్ కు బిల్ గేట్స్ ఫిదా అయ్యారు. పరిపాలనలో టెక్నాలజీని వాడటం బాగుందని చెప్పారు. రాబోయే రోజుల్లో మరింత ముందుకు వెళ్లాలని ఆకాంక్షించారు. సీఎం చంద్రబాబు చాలా ముందుచూపుతోనే ఆలోచిస్తున్నారంటూ కితాబు ఇచ్చారు.
ప్రాజెక్టుల దగ్గరి నుంచి పరిపాలన దాకా.. అగ్రికల్చర్ నుంచి అన్ని రంగాల్లో ఏఐ టెక్నాలజీని ఎలా వాడుతున్నామనేది సీఎం చంద్రబాబు వివరించడంతో సంతోషించారు బిల్ గేట్స్. ఇలా సీఎం చంద్రబాబు పాలనపై బిల్ గేట్స్ ప్రశంసలు కురిపించడంతో పాపం వైసీపీకి నిద్ర పట్టట్లేదు. ప్రపంచ కుబేరుడే వచ్చి చంద్రబాబు విజన్ సూపర్ అంటే వైసీపీ బ్యాచ్ ఆగమైపోవడం ఖాయం అంటున్నారు కూటమి నేతలు.