AP: చిరంజీవి, పవన్ వద్ద అప్పు తీసుకున్న నాగబాబు

తనకు, తన భార్యకు కలిపి చరాస్తులు మొత్తం రూ.59.12 కోట్లు ఉన్నట్లు అఫిడవిట్;

Update: 2025-03-09 04:30 GMT

ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన కొణిదెల నాగబాబు అఫిడవిట్‌లో ఆస్తుల, అప్పుల వివరాలు తెలిపారు. మ్యూచ్‌వల్ ఫండ్స్/బాండ్లు రూ.55.37 కోట్లు, బ్యాంకులో సేవింగ్స్ రూ.23.53 లక్షలు, చేతిలో నగదు రూ.21.81లక్షలు, మొత్తం స్థిరాస్తులు రూ.11 కోట్లు, చరాస్తులు రూ.59 కోట్లు, ఇతరులకు ఇచ్చిన అప్పులు రూ.1.08 కోట్లు ఉన్నాయి. కాగా, చిరంజీవి వద్ద రూ.28 లక్షలు, పవన్ కల్యాణ్ వద్ద రూ.6 లక్షలు అప్పు తీసుకున్నారు. తనపై ఎలాంటి క్రిమినల్‌ కేసులూ లేవని స్పష్టం చేశారు. అఫిడవిట్‌లో ఆయన పేర్కొన్న తన వద్ద ఉన్న వాహనాల వివారాలను కూడా నాగబాబు పేర్కొన్నారు. బెంజ్‌ కారు రూ.67.28 లక్షలు , హ్యుందయ్‌ కారు రూ.11.04 లక్షలు, రూ.18.10 లక్షల విలువైన 226 గ్రాముల బంగారం తనవద్ద, తన భార్యవద్ద రూ.16.50 లక్షల విలువైన 55 క్యారట్ల వజ్రాలు, రూ.57.99 లక్షల విలువైన 724 గ్రాముల బంగారం, రూ.21.40 లక్షల విలువైన 20 కేజీల వెండి ఉన్నట్లు ఎన్నికల సంఘానికి సమర్పించిన నివేదికలో పేర్కొన్నారు. తనకు, తన భార్యకు కలిపి చరాస్తులు మొత్తం రూ.59.12 కోట్లు ఉన్నట్లు వెల్లడించారు.

హైదరాబాద్‌లోని మణికొండలో రూ. 2.88 కోట్ల విలువైన 460 చదరపు అడుగుల రెసిడెన్షియల్ విల్లా కలిపి మొత్తంగా రూ. 11.20 కోట్ల స్థిరాస్తులు ఉన్నట్టు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఇక, అప్పుల విషయానికి వస్తే.. రెండు బ్యాంకుల్లో రూ. 56.97 లక్షల గృహరుణం, రూ. 7,54,895 కారు రుణం ఉన్నాయి. అలాగే, ఇతర వ్యక్తుల వద్ద రూ.1.64 కోట్ల అప్పులున్నాయి. అన్న చిరంజీవి నుంచి 28,48,871 రూపాయలు, తమ్ముడు పవన్ కల్యాణ్ నుంచి రూ. 6.9 లక్షల అప్పు తీసుకున్నట్టు నాగబాబు అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

Tags:    

Similar News