ఏపీ మంత్రివర్గంలో మెగా బ్రదర్ నాగబాబుకు చోటు దక్కనుందని తెలుస్తోంది. అతి త్వరలో పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబు చంద్రబాబు క్యాబినెట్ లోకి చేరనున్నారు. ఈ విషయాన్ని స్వయంగా చంద్రబాబు తెలిపారు. నాగబాబు కేబినెట్‌లోకి ఎంట్రీ వెనుక పెద్ద ప్లాన్ ఉన్నట్టు తెలుస్తోంది. రాజ్యసభ MPగా పంపేందుకు అవకాశం వున్నా ఆయన్ను ఢిల్లీకి పంపలేదు. దీనికి వెనుక పవన్ కల్యాణ్ మాస్టర్ ప్లాన్ వేసినట్టు సమాచారం. పార్టీని బలోపేతం చేయాలంటే నాగబాబుకు పదవి అవసరం అని పవన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.