Naga Babu : ఎంపీ కానున్న నాగబాబు..? టీడీపీ-జనసేన ఖాతాలోకి వైసీపీ సీట్లు

Update: 2024-11-27 09:00 GMT

ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీగా ఉన్న మూడు రాజ్యసభ స్థానాలకు నోటిఫికేషన్ విడుదలైంది. డిసెంబర్ 3 నుంచి 10 తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఎన్నిక అనివార్యమైతే డిసెంబర్ 20న పోలింగ్ జరగనుంది. వైసీపీ నుంచి రాజ్యసభ ఎంపికైన మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్యలు తమ పదవులకు రాజీనామా చేయడంతో మూడు సీట్లు ఖాళీ అయ్యాయి. అసెంబ్లీలో ప్రస్తుతం వైసీపీకి కేవలం 11 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. దీంతో మూడు రాజ్యసభ సీట్లు కూటమికే దక్కనున్నాయి. మూడింటిలో ఒకటి జనసేనకు ఇస్తారనే ప్రచారం సాగుతోంది. జనసేనకు ఇస్తే నాగబాబుకు రాజ్యసభ సీటు దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది

Tags:    

Similar News