ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన హామీని నారా బ్రాహ్మణి తాజాగా నెరవేర్చారు. ఎన్నికల సందర్భంగా తమను కలిసిన నారా బ్రాహ్మణికి కూరగాయల వ్యాపారులు తమ అభ్యర్థన తెలిపారు. కూరగాయలు అమ్ముకునేందుకు సరైన స్థలం లేక ఇబ్బందులు పడుతున్నామని నారా బ్రాహ్మణికి కూరగాయల వ్యాపారులు తెలిపారు. తాజాగా సమస్య పరిష్కారానికి కూరగాయల వ్యాపారులకు స్థలాన్ని మున్సిపల్ అధికారులు కేటాయించారు. తమ సమస్యను అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన నారా బ్రాహ్మణికి కూరగాయల వ్యాపారులు కృతజ్ఞతలు తెలిపారు. తమ సమస్య పరిష్కారమైందని సంతోషం వ్యక్తం చేశారు.
నారా బ్రాహ్మణికి వ్యాపారుల కృతజ్ఞతలు
2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల వేళ మంగళరిలో నారా బ్రాహ్మణి ఇచ్చిన మాటను తాజాగా నిలబెట్టుకున్నారు. కూరగాయలు అమ్ముకునేందుకు సరైన స్థలం లేక ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు కొందరు నారా బ్రాహ్మణికి తెలిపారు. తన దృష్టికి వచ్చిన ఈ సమస్యను అధికారులకు చెప్పారు నారా బ్రాహ్మణి. అయితే, తాజాగా కూరగాయల వ్యాపారులకు అధికారులు స్థలాన్ని కేటాయించారు. దీంతో వారు బ్రాహ్మణికి కృతజ్ఞతలు తెలిపారు