సీఎం జగన్‌పై లోకేష్ తీవ్ర విమర్శలు..
నిజమేంటో జనానికి తెలిసే సరికి జగన్ రెడ్డి అబద్దాలు ప్రపంచాన్ని చుట్టి వస్తున్నాయంటూ ట్వీట్ చేశారు.;
ఏపీ సీఎం జగన్‌పై తీవ్ర విమర్శలు చేశారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్. నిజమేంటో జనానికి తెలిసే సరికి జగన్ రెడ్డి అబద్దాలు ప్రపంచాన్ని చుట్టి వస్తున్నాయంటూ ట్వీట్ చేశారు. అసత్య ప్రచారమే పెట్టుబడిగా అధికారం అండతో అమరావతిపై పన్నిన మరో కుట్రని టీడీపీ బట్టబయలు చేసిందన్నారు. ఫేక్ సీఎం ఆదేశాలతో, ఫేక్ ఎమ్మెల్యే ఆర్కే... అసైన్డ్ రైతుల పేరుతో సీఐడీకి ఫేక్ ఫిర్యాదు ఇచ్చారని ఆధారాలతో సహా బయటపెట్టామన్నారు. ఇప్పటికైనా... ప్రజా రాజధాని అమరాతవిపైనా, టీడీపీపైనా కుతంత్రాలు ఆపాలన్నారు. అమరావతి విధ్వంసానికి ప్రయత్నించిన ప్రతిసారి న్యాయమే గెలుస్తుందన్నారు. జగన్‌రెడ్డి అసత్యపు కుట్రలు బట్టబయలవుతునే ఉంటాయన్నారు లోకేష్.