నిరుద్యోగులు నిరుత్సాహం చెందొద్దు.. అండగా ఉంటా : నారా లోకేష్
ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి నాగేంద్రప్రసాద్ తల్లికి సాయంగా రూ. 2 లక్షల చెక్ ను టీడీపీ నేత నారా లోకేష్ అందజేశారు.;
ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి నాగేంద్రప్రసాద్ తల్లికి సాయంగా రూ. 2 లక్షల చెక్ ను టీడీపీ నేత నారా లోకేష్ అందజేశారు. ఏ తల్లికి ఇటువంటి కష్టం రాకుండా అంతా కలిసి ప్రభుత్వంపై పోరాడుదామన్నారు. అండగా ముందు నేనుంటానంటూ లోకేష్ హామీ ఇచ్చారు. వైఎస్ జగన్‌రెడ్డి అధికారంలోకొచ్చి రెండేళ్లయినా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ లేదనే నిరుత్సాహంతో యువకులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారరని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవ్వరూ నిరుత్సాహం చెందొద్దన్నారు. అండగా తానుంటానని లోకేష్ భరోసా ఇచ్చారు.