జగన్‌ వ్యాఖ్యలు సిగ్గు చేటు : లోకేష్‌

విపక్షంలో ఉన్నప్పుడు నష్టపరిహారం అంచనా కూడా అవసరం లేదన్న జగన్‌ ఇప్పుడు ఎకరాకు రూ. 5వేలు పరిహారం ఇచ్చి రైతుల్ని అవమానపరస్తున్నారు.

Update: 2020-12-30 01:51 GMT

ఏపీలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే.. రైతులకు సంక్రాంతి పండగ ముందే వచ్చిందంటూ ప్రభుత్వం ప్రకటనలు ఇచ్చుకోవడం దారుణమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ మండిపడ్డారు. జగన్‌ 19 నెలల పాలనలో 767 రైతులు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో లోకేశ్‌ "రైతు కోసం" యాత్ర చేపట్టారు. 50 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని, పదివేల కోట్ల నష్టం వస్తే.. కేవలం 600 కోట్లు విదిల్చి పండ వచ్చిందని ఎలా అంటారని ప్రశ్నించారు లోకేష్‌. విపక్షంలో ఉన్నప్పుడు నష్టపరిహారం అంచనా కూడా అవసరం లేదన్న జగన్‌ ఇప్పుడు ఎకరాకు రూ. 5వేలు పరిహారం ఇచ్చి రైతుల్ని అవమానపరస్తున్నారు.

మేడపి గ్రామంలో రైతులతో కలిసి రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్నారు లోకేష్‌. తుఫాను ధాటికి నష్టపోయిన రైతుల్ని ప్రభుత్వం ఆదుకోవడంలో విఫలమైందని విమర్శించారు. ఎకరానికి ఐదు వేల పరిహారం ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారని మండిపడ్డారు. జగన్‌ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అకాల వర్షాలు, వరదలు, తుఫాన్లతో రైతులు తీవ్రంగా నష్టపోయారని అన్నారు. ఎకరానికి 25వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. దెబ్బతిన్న పంటల్ని కనీస మద్దతు ధరకు ప్రభుత్వకొనుగోళ్లు చేయాలన్నారు.

జగన్‌ వ్యాఖ్యలు సిగ్గు చేటంటూ విమర్శిస్తున్నారు లోకేష్‌. ఇప్పటికైనా సరైనా చర్య తీసుకోవాలని డిమాండ్‌ చేసారు. రైతులకు పదివేల కోట్లు నష్టం వస్తే..కేవలం 600 కోట్లు ఇచ్చి చేతులు విదిల్చుకున్నారంటూ ఫైర్‌ అయ్యారు


Tags:    

Similar News