Nara Lokesh: టీడీపీ నేతల హౌస్ అరెస్ట్.. నారా లోకేష్ కుప్పం పర్యటనకు అందని సహకారం..
Nara Lokesh: చిత్తూరు జిల్లాలో టీడీపీ నేతలపై పోలీసుల నిఘా కొనసాగుతోంది.;
Nara Lokesh (tv5news.in)
Nara Lokesh: చిత్తూరు జిల్లాలో టీడీపీ నేతలపై పోలీసుల నిఘా కొనసాగుతోంది. ఇవాళ, రేపు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కుప్పంలో పర్యటిస్తుండటంతో.. జిల్లా నుంచి భారీగా టీడీపీ నేతలు వచ్చే అవకాశం ఉంది. దీంతో టీడీపీ నేతలపై నిఘా పెట్టిన పోలీసులు.. ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేస్తారు. కుప్పం చుట్టు పక్కల .. చెక్‌పోస్ట్‌లు పెట్టి తనిఖీలు చేస్తున్నారు. కుప్పంలోకి టీడీపీ నేతలు రాకుండా అడ్డుకుంటున్నారు.
వీ.కోట నుంచి కుప్పం వరకు రహదారిలో బారికేడ్లు ఏర్పాటు చేశారు. వాహనాల్లో వస్తున్న టీడీపీ నేతల్ని అడ్డుకుని.. తిప్పి పంపుతున్నారు. రాజ్ పేట చెక్‌పోస్ట్ వద్ద టీడీపీ నేతలతో పోలీసుల వాగ్వాదం జరిగింది.బుధవారం.. మున్సిపల్ ఎన్నికల్లో కేసులు ఉన్న వ్యక్తుల్ని అరెస్ట్ చేయోద్దంటూ పోలీసుల్ని హైకోర్టు ఆదేశించింది. అయినా పోలీసులు హైకోర్టు ఆదేశాలను పట్టించుకోవడం లేదు. మాజీ మంత్రి అమర్నాథ్‌రెడ్డి వెంటే పోలీసు నిఘా టీం ఉంచారు.
ఇవాళ ఇవాళ సాయంత్రం.. బెంగళూరు నుంచి కుప్పంకు రానున్నారు నారా లోకేష్. ఇవాళ, రేపు కుప్పం మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. కుప్పం చేరుకున్న వెంటనే టీడీపీ నేతలతో సమావేశం కానున్నారు. లోకేష్ పర్యటనకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు టీడీపీ నేతలు. ప్రచారంలో పాల్గొనేందుకు పెద్ద సంఖ్యలో నేతలు.. టీడీపీ ఆఫీస్‌కు చేరుకుంటున్నారు. తమ కార్యక్రమాలకు అడ్డుపడితే దేనికైనా సిద్ధమంటున్నారు టీడీపీ కార్యకర్తలు, నేతలు.