వైసీపీ రౌడీలు ఏకంగా అంగన్‌వాడీ స్కూల్‌నే కాల్చేశారు : నారా లోకేశ్
ముఖ్యమంత్రిగారి సొంత జిల్లాలో వైసీపీ నేతలు... ముస్లీం మహిళను వేధిస్తున్న తీరు చూస్తే... రాష్ట్రంలో రాక్షసరాజ్యం సాగుతున్నట్లు స్పష్టమవుతుందని టీడీపీ జాతీయ ప్రధాన..;
ముఖ్యమంత్రిగారి సొంత జిల్లాలో వైసీపీ నేతలు... ముస్లీం మహిళను వేధిస్తున్న తీరు చూస్తే... రాష్ట్రంలో రాక్షసరాజ్యం సాగుతున్నట్లు స్పష్టమవుతుందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. రాయచోటిలో అంగన్‌వాడీ వర్కర్‌ని తీసేసి తమవాళ్లను నియమించుకునేందుకు వైసీపీ రౌడీలు ఏకంగా అంగన్‌వాడీ స్కూల్‌నే కాల్చేశారంటూ ట్వీట్ చేశారు. అంగన్‌వాడీ ఉద్యోగమే ఆధారంగా బతుకుతున్న ముస్లీం మహిళను... ఉద్యోగం నుంచి తొలగించడంతో పాటు ఆమెపై తప్పుడు కేసులు పెట్టారని ట్విట్టర్‌లో మండిపడ్డారు. నలుగురు పిల్లలతో ఉన్న ఒంటరి మహిళను నడిరోడ్డున పడేయడమేనా జగన్‌రెడ్డిగారు మహిళలకు ఇచ్చే భరోసా... అని ప్రశ్నించారు నారా లోకేష్.