మంత్రి నారా లోకేష్ ఏం చేసినా సరే ఒక కొత్త విధానాన్ని, కొత్త మార్పును సమాజంలో తీసుకువచ్చేలా ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోంది. ఆయన చెప్పే మాటలు, చేస్తున్న పనులు, మరీ ముఖ్యంగా విద్యార్థుల కోసం ఆయన చేస్తున్న విధివిధానాలు అత్యద్భుతంగా ఉంటున్నాయి. స్టూడెంట్ లకు కేవలం విద్యాపరమైన వసతులు, టెక్నాలజీని దగ్గర చేయటం మాత్రమే కాకుండా చట్టాలపై, హక్కులపై, బాధ్యతలపై అవగాహన కల్పించే విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. విద్యాశాఖ మంత్రిగా ఉన్న ఆయన విద్యార్థులకు అన్ని రకాల వసతులు కల్పించి అత్యాధునికంగా విద్యా విధానాన్ని మార్చేశారు. దీనికి తోడు విద్యార్థులకు నిన్న రాజ్యాంగం మీద అవగాహన కల్పించేందుకు మాక్ అసెంబ్లీ నిర్వహించారు. ఇందులో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ స్కూల్లో నుంచి విద్యార్థులను తీసుకొచ్చి మాక్ అసెంబ్లీ చేపట్టారు. అసెంబ్లీ అంటే ఎలా ఉండాలి అనేది ఇందులో చూపించారు. కేవలం ప్రజా సమస్యలు, రాష్ట్ర అభివృద్ధి పై మాత్రమే అసెంబ్లీలో మాట్లాడాలి అని ఇందులో చూపించారు. అధికార పక్షం, ప్రతిపక్షాలు ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ చాలా హుందాతనంగా ప్రజల సమస్యల మీద చర్చలు జరిపించారు మాక్ అసెంబ్లీలో.
అంటే రాబోయే రోజుల్లో విద్యార్థులకు రాజకీయాల మీద అవగాహన పెరిగే విధంగా ఇప్పటి నుంచే మాక్ అసెంబ్లీ ద్వారా చర్యలు తీసుకున్నారు లోకేష్. ఒకవేళ నేటితరం భవిష్యత్తులో రాజకీయాల్లోకి వస్తే ఎంత హుందాతనంగా ప్రవర్తించాలో ఇప్పటి నుంచే అవగాహన కల్పిస్తున్నారు. నిజంగా ఇది ఒక గొప్ప మార్పు అని చెప్పాలి. వైసీపీ హయాంలో అసెంబ్లీని అత్యంత దారుణంగా బ్రష్టు పట్టించారు. మహిళలను కూడా నిండు అసెంబ్లీలో అత్యంత ఘోరంగా అవమానిస్తూ.. మంత్రులు తమ స్థాయిని మర్చిపోయి ప్రతిపక్షాలను బూతులు తిట్టడం మాత్రమే మనం వైసిపి టైంలో చూసాం. ఇలా హుందాతనంగా ప్రవర్తించడం ఎప్పుడైనా చూసామా. అందుకే లోకేష్ చేస్తున్న ప్రయత్నాన్ని కచ్చితంగా అభినందించాలి.