Nara Lokesh : గేరు మార్చిన లోకేష్.. ఏపీకి లక్షల కోట్ల పెట్టుబడులు..

Update: 2026-01-21 11:04 GMT

మంత్రి నారా లోకేష్ దావోస్ లో ప్రస్తుతం విస్తృతంగా పర్యటిస్తున్నారు. అటు సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రపంచ ప్రఖ్యాత కంపెనీల ప్రతినిధులతో వరుసగా భేటీలు అవుతూ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని కోరుతున్నారు. ఇంకోవైపు నారా లోకేష్ ఐటీ మంత్రిగా తన సత్తా చాటుతున్నారు. గతంలో ఎంవోయూలు కుదుర్చుకోవడానికే ఎక్కువ ప్రాధాన్యత చూపిన మంత్రి నారా లోకేష్.. ఈసారి దావోస్ సదస్సులో రూటు మార్చారు. ఈసారి ఏపీలో ఉన్న అవకాశాలను వివరిస్తూ దీర్ఘకాలిక పెట్టుబడులను ఆహ్వానిస్తున్నారు. దీర్ఘకాలికంగా ఏపీలో పెట్టుబడులు పెట్టాలంటే రాష్ట్రంపై నమ్మకమే ముఖ్యం అని నారా లోకేష్ గ్రహించారు.

అందులో భాగంగానే ఎక్కువ మీటింగుల్లో పాల్గొంటూ ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ఉన్న అవకాశాలతో పాటు తమ ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను వివరిస్తున్నారు. పెట్టుబడులకు రక్షణగా ఏపీ ఉందని.. ఇక్కడ ఉన్న మ్యాన్ పవర్, యూత్ స్కిల్స్ ను కూడా వివరిస్తున్నారు. తమ ప్రభుత్వం విద్యార్థులకు ఎలాంటి టెక్నాలజీ పరమైన విద్యను అందిస్తుందో ఎలాంటి స్కిల్స్ ను నేర్పిస్తుందో చెబుతూ ఏపీని పెట్టుబడులకు స్వర్గధామంగా వాళ్ళందరి ముందు ప్రజెంట్ చేస్తున్నారు. దీంతో ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి చాలా సంస్థలు ముందుకు వస్తున్నాయి. నిన్న ఆర్ ఎంజడ్ కంపెనీ ఏపీలో లక్ష కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు అంగీకరించింది. ఈ విషయాన్ని ఆ సంస్థ అధినేత స్వయంగా ప్రకటించారు.

ఇలా కేవలం ఆర్ ఎంజడ్ మాత్రమే కాకుండా అనేక కంపెనీలు ఏపీలో దీర్ఘకాలికంగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి. గ్రీన్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ, ఇండస్ట్రియల్ పార్కుల రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారు. అటు సీఎం చంద్రబాబు నాయుడు కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆహ్వానిస్తున్నారు. ఇతర రాష్ట్రాల కంటే ఏపీకే ఎక్కువ పెట్టుబడులు వస్తున్నట్లు ఇప్పటికే కేంద్ర సంస్థలు ప్రతిపాదిస్తున్నాయి. మరి ఈసారి ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడులు ఏపీకి వస్తాయో చూడాలి.

Tags:    

Similar News