Nara Lokesh: లోకేష్‌కు తెలుగు తమ్ముళ్లు ఘనస్వాగతం
Nara Lokesh: ఏపీలో ప్యాలెస్ పిల్లి అరాచకాలకు పాల్పడుతోందన్నారు నారా లోకేష్. కడప సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్న ప్రొద్దుటూరు టీడీపీ ఇన్‌ఛార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డిని పరామర్శించారు.;
Nara Lokesh: ఏపీలో ప్యాలెస్ పిల్లి అరాచకాలకు పాల్పడుతోందన్నారు నారా లోకేష్. కడప సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్న ప్రొద్దుటూరు టీడీపీ ఇన్‌ఛార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డిని పరామర్శించారు. రాళ్ల దాడి కేసులో ప్రవీణ్ రెడ్డితో పాటు పలువురు టీడీపీ కార్యకర్తలు సెంట్రల్ జైలులో ఉన్నారు.
లోకేష్‌తో పాటు మరో 17 మందికి ములాఖత్ అయ్యారు. అధైర్య పడొద్దని పార్టీ అండగా ఉంటుందని వారికి భరోసా కల్పించారు. టీడీపి నేతలను అక్రమ అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు. కేసులు పెట్టినంత మాత్రాన భయపడతామని భ్రమ పడుతున్నారంటూ విమర్శించారు.
అంతకుముందు కడప ఎయిర్‌పోర్టులో లోకేష్‌కు గ్రాండ్ వెల్‌కమ్ లభించింది. హైదరాబాద్ నుంచి కడప ఎయిర్‌పోర్టుకు చేరుకున్న లోకేష్‌కు తెలుగు తమ్ముళ్లు ఘనస్వాగతం పలికారు. ఆయనకు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు ఎగబెడ్డారు. లోకేష్‌తో సెల్ఫీ దిగేందుకు కార్యకర్తలు పోటీ పడ్డారు. పోలీసు ఆంక్షలను లెక్క చేయక...వందలాది మంది ఎయిర్‌పోర్టు నుంచి లోకేష్‌తో ర్యాలీగా బయల్దేరారు.
దారి పొడవునా లోకేష్‌పై పూల వర్షం కురిపించి అభిమానం చాటుకున్నారు. జై లోకేష్, సీఎం నినాదాలతో హోరెత్తించారు. లోకేష్‌ను గజమాలతో సత్కరించారు. లోకేష్ పర్యటనతో కడప జిల్లా టీడీపీ నేతల్లో కొత్త ఉత్సాహం నింపింది.
అంతకుముందు ఎయిర్‌పోర్టులో కడప జిల్లా పార్టీ నేతలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లతో లోకేష్ సమావేశమయ్యారు. జిల్లాలో పార్టీ పరిస్థితిపై ఆరా తీశారు. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడాలని నేతలకు సూచించారు. పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు.