NARAYANA: అమరావతి సేఫ్ సిటీ.. అనుమానమే లేదు

గ్రాఫిక్స్ అంటే ప్రజలు క్షమించరు... జోరుగా నిర్మాణ పనులు: నారాయణ... నిర్మాణ పనుల్లో 13000 మంది కార్మికులు... అధికారుల క్వార్టర్లను పరిశీలించిన మంత్రి

Update: 2025-09-04 04:00 GMT

అమ­రా­వ­తి చాలా సేఫ్ సిటీ… ఇం­దు­లో అను­మా­నం లే­ద­ని ఏపీ పు­ర­పా­ల­క­శాఖ మం­త్రి పొం­గూ­రు నా­రా­యణ స్ప­ష్టం చే­శా­రు. రా­జ­ధా­ని ప్రాం­తం­లో పర్య­టిం­చిన ఆయన.. అమ­రా­వ­తి – నే­ల­పా­డు­లో­ని గె­జి­టె­డ్ అధి­కా­రుల భవ­నా­లు పరి­శీ­లిం­చా­రు.. క్లా­స్- 4 ఉద్యో­గుల క్వా­ర్ట­ర్లు ని­ర్మాణ పనుల పు­రో­గ­తి­ని అధి­కా­రు­ల­ను అడి­గి తె­లు­సు­కు­న్నా­రు.. ఇక, ఈ సం­ద­ర్భం­గా మీ­డి­యా­తో మా­ట్లా­డిన మం­త్రి నా­రా­యణ.. అమ­రా­వ­తి ని­ర్మా­ణం­లో ప్ర­స్తు­తం 13 వేల మంది పని చే­స్తు­న్నా­ర­ని తె­లి­పా­రు.. అధి­కా­రుల కోసం ఆరు టవ­ర్ల ని­ర్మా­ణం జరు­గు­తోం­ది.. 720 ప్లా­ట్లు గ్రూ­ప్ 1 అధి­కా­రుల కోసం రెడీ అవు­తు­న్నా­యి. నవం­బ­ర్ చి­వ­రి వరకు ని­ర్మ­ణా­లు పూ­ర్తి అయ్యే అవ­కా­శం ఉం­ద­న్నా­రు. నా­రా­యణ మా­ట్లా­డు­తూ, "అమ­రా­వ­తి గ్రా­ఫి­క్స్‌ల కోసం కాదు, ప్ర­జల భవి­ష్య­త్తు కోసం ని­ర్మిం­చు­కుం­టు­న్నాం. అమ­రా­వ­తి అంటే ప్ర­జ­ల­కు అభి­మా­నం ఉంది. గ్రా­ఫి­క్స్ చూ­పి­స్తూ మభ్య­పె­ట్టే రో­జు­లు పో­యా­యి. ఇప్పు­డు ప్ర­జ­లు నిజం తె­లు­సు­కుం­టు­న్నా­రు. అమ­రా­వ­తి చాలా సేఫ్ సిటీ. ఎలాం­టి అను­మా­నం లేదు" అని అన్నా­రు. ప్ర­స్తు­తం అమ­రా­వ­తి­లో సు­మా­రు 13,000 మంది కా­ర్మి­కు­లు వి­విధ ని­ర్మాణ పను­ల్లో పని­చే­స్తు­న్నా­ర­ని మం­త్రి తె­లి­పా­రు. అధి­కా­రు­లు ని­వ­సిం­చేం­దు­కు కా­వ­ల­సిన ఇళ్ల ని­ర్మా­ణం వే­గం­గా కొ­న­సా­గు­తోం­ద­ని చె­ప్పా­రు.

వేగంగా జరుగుతున్న పనులు

వచ్చే నె­ల­లో గ్రూ­ప్-డి ఉద్యో­గుల కోసం జరు­గు­తు­న్న ని­ర్మా­ణా­లు పూ­ర్త­వు­తా­య­ని పే­ర్కొ­న్నా­రు. “అన్ని ని­ర్మా­ణా­లు పూ­ర్త­యిన తర్వా­తే అధి­కా­రు­ల­కు గృ­హా­లు కే­టా­యి­స్తాం. అప్ప­టి­వ­ర­కు సహ­నం­గా ఉం­డా­లి” అని మం­త్రి నా­రా­యణ పే­ర్కొ­న్నా­రు. డ్రిం­కిం­గ్ వా­ట­ర్ కనె­క్ష­న్ ఇప్ప­టి­కే ఉంది.. వచ్చే నెల 2 గ్రూ­ప్ డీలో ఉన్న ని­ర్మ­ణా­లు పూ­ర్తి అవు­తా­యి అన్నా­రు. అన్ని ని­ర్మా­ణా­లు పూ­ర్తి అయిన తర్వా­తే అధి­కా­రు­ల­కు భవ­నా­లు అం­ద­చే­స్తా­మ­న్నా­రు. మరో­వై­పు, రా­జ­ధా­ని­పై పని గట్టు­కు­ని అబ­ద్ధా­లు చె­బు­తు­న్నా­రు అంటూ వై­ఎ­స్ఆ­ర్‌ కాం­గ్రె­స్‌ పా­ర్టీ నే­త­ల­పై ఫైర్ అయ్యా­రు.. అమ­రా­వ­తి గ్రా­ఫి­క్స్ అంటే ప్ర­జ­లు క్ష­మిం­చ­రు అని హె­చ్చ­రిం­చా­రు.. అమ­రా­వ­తి చాలా సేఫ్ సిటీ.. ఇం­దు­లో అను­మా­నం లే­ద­ని స్ప­ష్టం చే­శా­రు మం­త్రి పొం­గూ­రు నా­రా­యణ. కాగా, కూ­ట­మి ప్ర­భు­త్వం రా­జ­ధా­ని అమ­రా­వ­తి­లో ని­ర్మా­ణ­ల­పై ప్ర­త్యే­కం­గా ఫో­క­స్‌ పె­ట్టిన వి­ష­యం వి­ది­త­మే.. సీ­ఆ­ర్డీ­ఏ­లో ని­ర్ణ­యం తీ­సు­కో­వ­డం.. ఆ తర్వాత కే­బి­నె­ట్‌ ఆమో­దం తె­ల­ప­డం.. వెం­ట­నే.. అభి­వృ­ద్ధి కా­ర్య­క్ర­మా­ల­ను వే­గం­గా చే­ప­డు­తూ ముం­దు­కు సా­గు­తు­న్నా­రు. అమ­రా­వ­తి­పై­నే ప్ర­త్యేక దష్టి సా­రిం­చా­రు.

Tags:    

Similar News