RAMMOHAN: శభాష్ రామ్మోహన్

జాతీయ మీడియాలో ప్రశంసలు

Update: 2025-12-13 04:00 GMT

ఇటీవల తలెత్తిన ఇండిగో విమానయాన సంక్షోభం విజయవంతంగా పరిష్కారమైంది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు చొరవతో కొన్ని నిబంధనలకు మినహాయింపులు ఇవ్వడం, సమయపాలన మెరుగుపరచడం ద్వారా ఇండిగో విమానాలు తిరిగి యథావిథిగా నడుస్తున్నాయి. సంక్షోభ నివారణ చర్యల్లో భాగంగా ఇండిగో తమ సర్వీసుల్లో పది శాతం కట్ చేసుకునేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ కట్ అయిన సర్వీసులను ఇతర విమానయాన సంస్థలకు కేటాయించారు. సంక్షోభం ముగిసిన నేపథ్యంలో, మంత్రి రామ్మోహన్ నాయుడు జాతీయ మీడియా ద్వారా దేశ ప్రజలకు పూర్తి వివరాలను వివరిస్తున్నారు. వరుసగా అన్ని ప్రముఖ ఇంగ్లిష్, హిందీ ఛానెళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తూ, సమస్య పరిష్కారానికి తీసుకున్న చర్యలను, భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉండేందుకు చేయబోయే సంస్కరణలను ధృడంగా విశ్లేషిస్తున్నారు.

సం­క్షో­భం పీ­క్‌­లో ఉన్న­ప్పు­డు రి­ప­బ్లి­క్ టీ­వీ­కి చెం­దిన ఆర్నా­బ్ గో­స్వా­మి మం­త్రి వై­ఫ­ల్యా­న్ని ఎత్తి­చూ­పే ప్ర­య­త్నం చే­సి­నా, రా­మ్మో­హ­న్ నా­యు­డు తన పని­పై­నే దృ­ష్టి సా­రిం­చా­రు. ఇప్పు­డు, సమ­స్య పరి­ష్కా­ర­మైన తర్వాత, ఆయన దృ­ఢ­మైన సమా­ధా­నా­లు, సమ­స్య­ల­ను ఎదు­ర్కొ­న్న వి­ధా­నం­పై సర్వ­త్రా ప్ర­శం­స­లు దక్కు­తు­న్నా­యి.ప్ర­భు­త్వ వి­ధా­నా­ల­ను, బీ­జే­పీ­ని తీ­వ్రం­గా వి­మ­ర్శిం­చే సీ­ని­య­ర్ జర్న­లి­స్టు­లు కూడా మం­త్రి పని­తీ­రు, ఆయన అప్రో­చ్‌­ను కొ­ని­యా­డా­రు. సమ­స్య­ను యు­వ­నే­త­గా పరి­ష్క­రిం­చిన వైనం, మీ­డి­యా ద్వా­రా ప్ర­జ­ల­కు అం­దిం­చిన స్ప­ష్ట­మైన వి­శ్లే­షణ అం­ద­రి­నీ ఆక­ట్టు­కుం­ది.

పొందూరు ఖాదీకి జీఐ ట్యాగ్‌

పొం­దూ­రు ఖా­దీ­కి ప్ర­తి­ష్ఠా­త్మ­క­మైన భౌ­గో­ళిక గు­ర్తిం­పు లభిం­చిం­ద­ని కేం­ద్ర­మం­త్రి రా­మ్మో­హ­న్‌­నా­యు­డు తె­లి­పా­రు. ఈమే­ర­కు ఆయన ఎక్స్‌­లో పో­స్టు­లో చే­శా­రు. ‘‘శ్రీ­కా­కు­ళం వా­సి­గా ఎంతో గర్విం­చ­ద­గ్గ క్ష­ణం ఇది. ఎన్నో సం­వ­త్స­రాల ని­రీ­క్షణ, లె­క్క­లే­న­న్ని సమా­వే­శా­లు, డా­క్యు­మెం­టే­ష­న్, ఫా­లో­అ­ప్‌ల తర్వాత పొం­దూ­రు ఖా­దీ­కి ప్ర­తి­ష్టా­త్మ­క­మైన జీఐ ట్యా­గ్ లభిం­చ­డం ఎంతో ఆనం­దం­గా ఉంది. ఇది కే­వ­లం ఒక వస్త్రా­ని­కి వచ్చిన గు­ర్తిం­పు మా­త్ర­మే కాదు.. శ్రీ­కా­కు­ళం నేత కా­ర్మి­కుల వా­ర­స­త్వా­ని­కి లభిం­చిన గౌ­ర­వం. భారత స్వా­తం­త్ర్య ఉద్య­మం­లో కీలక పా­త్ర పో­షిం­చిన మహా­త్మా గాం­ధీ­కి ప్రి­య­మైన పొం­దూ­రు ఖాదీ.. ప్ర­తి నూలు పో­గు­లో తరాల చరి­త్ర­ను మో­స్తుం­ది. ఎన్ని కష్టా­లు వచ్చి­నా మన నేత కా­ర్మి­కు­లు తమ కళను వద­ల్లే­దు. వారి ఓర్పు, నై­పు­ణ్యం, నమ్మ­కం ఈ సం­ప్ర­దా­యా­న్ని సజీ­వం­గా ఉం­చా­యి. వారి చే­తు­లు కే­వ­లం వస్త్రా­న్ని మా­త్ర­మే కాదు ఒక గు­ర్తిం­పు­ను తె­చ్చా­యి. ఈ జీఐ ట్యా­గ్ సా­ధ­న­లో అం­డ­గా ని­లి­చిన ఖాదీ & గ్రా­మీణ పరి­శ్ర­మల కమి­ష­న్‌­కు ప్ర­త్యేక ధన్య­వా­దా­లు. తర­త­రా­లు­గా ఈ కళను కా­పా­డిన నేత కా­ర్మి­కు­ల­కు ఈ గౌ­ర­వం అం­కి­తం. జీఐ ట్యా­గ్.. ’’ అని రా­మ్మో­హ­న్‌ నా­యు­డు అన్నా­రు.

Tags:    

Similar News