Nellore: కేబినెట్‌లో స్థానం దక్కని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి.. అనుచరుల నిరసన..
Nellore: ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి మంత్రి పదవి ఇవ్వకపోవడంపై.. ఆయన అనుచరులు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు.;
Nellore: నెల్లూరు జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి మంత్రి పదవి ఇవ్వకపోవడంపై.. ఆయన అనుచరులు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. తమ నాయకుడికి ఘోర అవమానం జరిగిందంటూ రగిలిపోతున్న ఆయన అనుచరులు.....జగన్ సర్కారుపై యుద్ధం ప్రకటించారు. ఇందులో భాగంగా తమ పదవులు వదులుకునేందుకు సిద్ధమయ్యారు. 26మంది కార్పొరేటర్లు, 18 మంది సర్పంచులు, 12 మంది MPTCలు రాజీనామాలు చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇదే విషయంపై చర్చించేందుకు ప్రజా ప్రతినిధులంతా నెల్లూరులోని ఎమ్మెల్యే కోటంరెడ్డి కార్యాలయంలో భేటీ అయ్యారు. అనుచరుందరితో కలిసి భవిష్యత్ కార్యాచరణపై రాష్ట్రకార్యదర్శి గిరిధర్‌రెడ్డి మంతనాలు జరుపుతున్నారు.