టీడీపీలో చేరేందుకు 60శాతం వైసీపీ ఎమ్మెల్యేలు సిద్ధం:MLA ఆనం రామనారాయణ

60శాతం మంది వైసీపీ ఎమ్మెల్యేలు త్వరలో TDPలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని నెల్లూరు అర్బన్ MLA ఆనం రామనారాయణరెడ్డి చెప్పారు;

Update: 2023-05-23 05:00 GMT

నెల్లూరు అర్బన్ MLA ఆనం రామనారాయణరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 60 శాతం మంది వైసీపీ ఎమ్మెల్యేలు త్వరలో TDPలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. వైసీపీ ఎమ్మెల్యేలతో పాటు నాయకుల్లోను సొంత ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో టీడీపీ విజయం ఖాయమని స్పష్టంచేశారు. మీడియా చిట్‌చాట్‌లో ఆనం రామనారాయణరెడ్డి చేసిన ఈ సంచలన వ్యాఖ్యలు ఇపుడు ఏపీలో హాట్‌టాపిక్‌గా మారింది. అటు అధికార వైసీపీలో ఆనం కామెంట్స్‌ ప్రకంపనలు రేపుతుండగా.. సోషల్ మీడియాలోను వైరల్‌గా మారాయి.

Tags:    

Similar News