AP : ఏపీ ఫ్రీ బస్సు పథకం పై రీల్స్...స్టార్ట్ చేశారా అంటూ నెటిజన్ల ఫైర్..
ఆంధ్రప్రదేశ్ లో ఇటీవలే ఫ్రీ బస్సు పథకం అమలులోకి వచ్చిన సంగతి తెలిసిందే. మహిళలు ప్రయాణ ఖర్చులు లేకుండా ఉద్యోగాలకు వెళ్లడం, కుటుంబాలకు అండగా ఉండటం, వారికి ఆర్థిక భరోసా కల్పించడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే సోషల్ మీడియాలో మాత్రం లైక్ లు, కామెంట్ల కోసం రీల్స్ చేస్తుంటారు కొందరు యువత. ఇంతకు ముందు తెలంగాణ లో ఫ్రీ బస్సు పథకం పై చాలా వీడియోలు వైరల్ అయ్యాయి. మా పిల్లాడు అన్నం తినడం లేదని...మా వదిన ఏం కూర వండిందో తెలుసుకుందాం అని ఊరికి వెళ్తున్న అంటూ చాలా మంది వీడియోలు చేశారు. తాజాగా ఏపీలో సైతం ఓ యువతి చేసిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
అనంతపుర్ కు చెందిన ఓ మహిళ తన తల్లికి కట్లపొడి, ఆకులు తీసుకొచ్చేందుకు తాడిపత్రి నుండి అనంతపూర్ వెళ్తున్నట్లు పేర్కొంది. ఆధార్ కార్డు ఉంటే చాలు అని డబ్బులు అక్కర్లేదు అని ఆమె కామెంట్ చేసింది. ఇక ఈ వీడియో వైరల్ కావడంతో ఏపీ లోనూ స్టార్ట్ చేశారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. ఏది ఏమైనా ప్రభుత్వ పథకాలను మంచి పనులకు వినియోగించుకోవాలి కాని ఇలా సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడానికి కాదు అంటూ మరికొందరు అభిప్రాయపడుతున్నారు.