AP: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త విద్యుత్‌ విధానం

ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రకటన... ఇంధన పాలసీపై సమీక్ష;

Update: 2024-08-21 01:30 GMT

ఆంధ్రప్రదేశ్‌లో నూతన ఇంధన పాలసీపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమీక్ష నిర్వహించారు. ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024 పేరిట కూటమి ప్రభుత్వం కొత్త విద్యుత్ విధానాన్ని అమల్లోకి తేనుంది. రెన్యూవబుల్ ఎనర్జీలో 2014- 2019 మధ్య కాలంలో దేశంలో టాప్‌లో ఉన్న ఏపీ.. 2019 తరవాత ప్రభుత్వ విధానాలతో విద్యుత్ ఉత్పత్తి రంగం సంక్షోభంలోకి వెళ్లిందని అధికారులు వివరించారు. దీంతో గత ప్రభుత్వంపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో సోలార్, విండ్, పంప్డ్ స్టోరేజ్ ఎనర్జీ, బయో ఎనర్జీకి ఉన్న అన్ని అవకాశాలను అందిపుచ్చుకుని ముందుకు సాగేలా కొత్త పాలసీ రూపొందించాలని సీఎం సూచించారు. పర్యావరణ హితంగా, తక్కువ ఖర్చుతో విద్యుత్ ఉత్పత్తి సాధించేలా పాలసీ రూపకల్పనపై చర్చించారు. సాధ్యమైనంత తక్కువ సమయంలోనే పెట్టుబడులు, వినియోగదారులకు తక్కువ ధరకే విద్యుత్ సరఫరా చేసే విధంగా పాలసీ రూపకల్పనపై సీఎం సమీక్షించారు.

ఏపీలో సోలార్‌, విండ్‌, పంప్డ్‌ స్టోరేజ్‌ ఎనర్జీ, బయో ఎనర్జీకి ఉన్న అన్ని అవకాశాలను అందిపుచ్చుకుని ముందుకు సాగేలా కొత్త పాలసీ రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. పర్యావరణ హితంగా, తక్కువ ఖర్చుతో విద్యుత్‌ ఉత్పత్తి సాధించేలా పాలసీ రూపకల్పనపై అధికారులతో చర్చించారు. సాధ్యమైనంత తక్కువ సమయంలోనే పెట్టుబడులు, వినియోగదారులకు తక్కువ ధరకే విద్యుత్‌ సరఫరా చేసే విధంగా పాలసీ రూపకల్పనపై చర్చించారు. వివిధ రాష్ట్రాలు, ఇతర దేశాల్లో సాంప్రదాయేతర విద్యుత్‌ ఉత్పత్తికి అనుసరిస్తున్న విధానాలను స్టడీ చేసి కొత్త పాలసీకి రూపకల్పన చేయాలన్నారు. రానున్న రోజుల్లో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు తీసుకుకోవాల్సిన చర్యలపైనా చర్చించారు. వ్యక్తులు, సంస్థలు సౌర విద్యుత్ ఉత్పత్తి, మిగులు విద్యుత్ విక్రయంచేలా కొత్త విధానం ఉండాలన్నారు. సౌర విద్యుత్ ప్యానెళ్ల తయారీ పరిశ్రమలను రాష్ట్రానికి రప్పించే అంశంపైనా చర్చించారు.

వివిధ రాష్ట్రాలు, ఇతర దేశాల్లో సాంప్రదాయేతర విద్యుత్ ఉత్పత్తికి అనుసరిస్తున్న విధానాలను స్టడీ చేసి కొత్త పాలసీకి రూపకల్పన చేయాలని చంద్రబాబు ఆదేశించారు. 2029 నాటికి, 2047 నాటికి విద్యుత్ అవసరాలు, ఉత్పత్తి లెక్కించి పాలసీని కూటమి ప్రభుత్వం సిద్దం చేయనుంది. రానున్న రోజుల్లో ఎలక్ట్రిక్ వాహనాలు ప్రోత్సహించేందుకు తీసుకుకోవాల్సిన చర్యలపైనా పాలసీలో చర్చించారు. వ్యక్తులు, సంస్థలు సోలార్ విద్యుత్ ఉత్తత్తి చేసుకోవడం మిగులు విద్యుత్ అమ్ముకోవడాన్ని సులభతరం చేసేలా పాలసీ ప్రభుత్వం తీసుకురానుంది. సోలార్ విద్యుత్ పానెళ్ల తయారీ పరిశ్రమలను రాష్ట్రానికి రప్పించే అంశంపైనా చర్చించారు.

Tags:    

Similar News