ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోయే కొత్త ప్రభుత్వంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇంట్రస్టింగ్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సోమవారం ముగిసింది. పోలింగ్ అనంతరం రాష్ట్రంలో గెలుపు ఓటములపై చర్చలు జరుగుతున్నాయి.
ప్రధాన పార్టీలన్ని గెలుపు తమదే అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే రాబోయే ఏపీ సార్వత్రిక ఎన్నికల ఫలితాల పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరు అధికారంలోకి వచ్చినా వాళ్లతో సఖ్యతగా ఉంటామని తెలిపారు.
ఏపీలో ఏ సర్కారు వచ్చినా తాను కలిసి పనిచేస్తానని చెప్పారు రేవంత్. ఓ సీఎంగా తాను పాజిటివ్ థింకింగ్ మాత్రమే చేస్తానని, నెగిటివ్ థింకింగ్ ఉండదని వ్యాఖ్యానించారు రేవంత్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ భవిష్యత్ తనకు ముఖ్యమని వెల్లడించారు. తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్ కోసం 100 సంవత్సరాల ప్రణాళికతో పాలన సాగిస్తామని చెప్పారు.