Andhra Pradesh High Court : ఏపీ హైకోర్టుకు కొత్త న్యాయమూర్తులు.. కొలీజియం సిఫార్సు

Update: 2025-08-26 07:30 GMT

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల హైకోర్టులకు న్యాయమూర్తులను బదిలీ చేస్తూ సుప్రీమ్ కోర్టు కొలీజియం కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం 14 రాష్ట్రాల హైకోర్టు న్యాయమూర్తులను బదిలీ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఏపీ హైకోర్టుకు ముగ్గురు జడ్జి లు బదిలీ అయ్యారు. గుజరాత్, అలహాబాద్, కోల్ కతా హైకోర్టు జడ్జిలను సుప్రీంకోర్టు కొలీజియం రాష్ట్రానికి సిఫారసు చేసింది. దీంతో జస్టిస్ మానవేంద్రనాథ్ రాజ్ తో పాటు జస్టిస్ డి.రమేశ్, జస్టిస్ సుబేందు సమంత అమరావతిలోని హైకోర్టుకు బదిలీ అయ్యారు. కాగా ఈ ముగ్గురు న్యాయమూర్తులు మరో రెండు రోజుల్లో బాధ్యతలు తీసుకోనున్నారు.

Tags:    

Similar News