నివర్ తుఫాను :పుంగనూరులో భారీగా‌ పంట నష్టం

Update: 2020-11-27 09:12 GMT

చిత్తూరు జిల్లాను నివర్‌ తుపాను అతలాకుతలం చేసింది. పుంగనూరు నియోజకవర్గంలో గత రెండు రోజులుగా కురిసిన వర్షానికి ఖరీఫ్‌ పంటకు తీవ్ర నష్టం వాటిళ్లింది. నియోజకవర్గంలో 2793 హెక్టార్ల మేర రైతులు వరి సాగు చేస్తున్నారు. పంగనూరు మండలంలో 498 హెక్టార్లు, రామసముద్రం మండలంలో 102, పంజాణిలో 375, చౌడేపల్లిలో 252 హెక్టార్లలో పంటనష్టం జరిగింది. చెరువుల్లో వరద నీరు నిండి పంటల్లోకి చేరడంతో రైతన్నలు తీవ్రంగా నష్టపోయిరు. తుపాను ప్రభావంతో నష్టపోయిన రైతుల పంటలను పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక పంపుతామన్నారు వ్యవసాయశాఖ ఎండీ.

Tags:    

Similar News