BJP Madhav : ఏ ఒక్కరు కూడా చట్టం నుంచి తప్పించుకోలేరు: మాధవ్

Update: 2025-08-01 06:15 GMT

గత వైసిపి పాలనలో డిజిటల్ లావాదేవీలు లేకుండా చేసి కల్తీ మద్యం అమ్మి పెద్ద మొత్తంలో ప్రజల సొమ్ము కాజేసిన ఏ ఒక్కరు కూడా చట్టం నుంచి తప్పించుకోలేరని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ పేర్కొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ నిన్నటి రోజున హైదరాబాదులో మద్యం కుంభకోణం కేసులో దొరికిన 11 కోట్ల రూపాయల నగదుతో పాటు చాలా చోట్ల దర్యాప్తు ముమ్మరంగా జరుగుతోందన్నారు. మేము ఇచ్చిన మద్యమే తాగాలని రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వమే మద్యం దుకాణాలు ఏర్పాటు చేసి గత ఐదేళ్లు దోపిడీ చేసిందని, రానున్న రోజుల్లో మద్యం కుంభకోణం కేసులో తిమింగలాలు బయటకు రానున్నాయని ఆయన తెలియజేశారు. బిజెపి టిడిపి జనసేన కూటమి ఎన్నికల వరకే కాకుండా అన్ని పార్టీల పెద్దల సూచనల మేరకు నామినేటెడ్ పదవుల పంపకాల్లోనూ కొనసాగిందని, రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ కోసం పని చేసిన కార్యకర్తలకు మరిన్ని నామినేటెడ్ పదవులు వచ్చేలా చూస్తామన్నారు. ప్రతి గ్రామంలోనూ భారతీయ జనతా పార్టీ జెండా ఎగురవేయాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని ఆ దిశగా పార్టీ నాయకులు,కార్యకర్తలు అంకితభావంతో పనిచేయాలన్నారు.

Tags:    

Similar News