AP : పల్నాడులో ఆగని జంతు అక్రమ రవాణా

Update: 2024-10-29 12:30 GMT

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడులో జంతువుల అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. లక్షలు దండుకుంటూ అధికారులు చోద్యం చూస్తున్నారంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇదేమిటని ప్రశ్నిస్తే అవునా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేయడం పరిపాటిగా మారింది. పల్నాడు జిల్లా గురజాల వ్యవసాయ మార్కెట్‌లో అర్థరాత్రి వందల సంఖ్యలో పశువుల అక్రమ రవాణా జరుగుతోంది. ప్రభుత్వ స్థలంలోనే ధైర్యంగా వందల కొద్దీ జంతువులను అక్రమంగా రవాణా చేస్తున్నారు. 300 ఎద్దులకు నెంబర్లు వేసి 10 కంటైనర్లలో తరలించేందుకు సిద్ధం చేశారు. కొనుగోలు అమ్మకాలకు సంబంధించి ఎలాంటి రసీదులు లేవు. రవాణా చేస్తున్న పశువులకు ఎలాంటి హెల్త్‌ సర్టిఫికెట్స్‌ లేవు. వీటిని కబేళాలకు తరలిస్తున్నారా లేక వ్యవసాయానికి తరలిస్తున్నారా అనే పూర్తి సమాచారం లేదు. దీనిపై మార్కెట్ యార్డ్ AD సూర్య ప్రకాష్ రెడ్డితో ఫోన్లో మాట్లాడగా తమకు ఎలాంటి సమాచారం లేకుండా వ్యవసాయ మార్కెట్ యార్డులోకి అక్రమంగా ప్రవేశించారని తెలిపారు. 

Tags:    

Similar News