పాలు లేదు.. వెన్న లేదు. అసలు నెయ్యి కూడా లేదు. కేవలం నెయ్యి లాంటి పదార్థాన్ని వాడారు. తిరుపతి లడ్డూ కల్తీ నెయ్యి కేసులో సంచలన నిజాలు బయటకు వస్తున్నాయి. ఈ కేసులో ఇప్పటి వరకు అందరికీ నెయ్యి కల్తీ అయింది అని మాత్రమే తెలుసు. కానీ అసలు నిజం ఏంటంటే.. ఈ లడ్డూ తయారీ కోసం అసలు నెయ్యినే వాడలేదు. అజయ్ సుగంద్ చెప్పిన దాని ప్రకారం.. అతను పరిశ్రమల్లో వాడే రసాయనాలను దిగుమతి చేసుకుని తిరుమల లడ్డూ తయారీ కోసం సప్లై చేశాడు. సుగంధ్ ఆయిల్ అండ్ కెమికల్స్ ఢిల్లీలో ఉన్న కంపెనీ నుంచి ఈ నెయ్యి లాంటి పదార్థాన్ని తెచ్చారు. మలేషియా నుంచి ఈ కెమికల్ ను 2019 నుంచి మాత్రమే తీసుకొచ్చారు.
ఇంకో విషయం ఏంటంటే 2023 అక్టోబర్ దాకా మాత్రమే ఈ కంపెనీ ఈ కెమికల్ ను మలేషియా నుంచి తీసుకొచ్చింది. గవర్నమెంట్ రిపోర్టులు కూడా ఉన్నాయి. ఈ కెమికల్ పేరు మోనో డి గ్లిజరైజ్ ఎసిటిక్ యాసిడ్ ఈస్టర్. ఇది చూడటానికి నెయ్యి లాగా ఉంటుంది. కానీ నెయ్యి కాదు. పాలు లేవు, వెన్న లేదు.. ఇవేవీ లేకుండానే నెయ్యి లాంటి పదార్థాన్ని తయారు చేయించి తిరుమలకు తీసుకొచ్చారు. వైవీ సుబ్బారెడ్డి చైర్మన్ గా ఉన్న టైమ్ లోనే ఈ దారుణాలు జరిగాయని తెలుస్తోంది.
ఎంత దారుణం.. ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన శ్రీవారి లడ్డూను ఇంత దారుణంగా కల్తీ చేశారంటే.. వీళ్లు ఏ స్థాయి ఘోరాలు చేశారో ఒకసారి ఊహించుకోవచ్చు. ఏ మాత్రం భయం అన్నది లేకుండా ఈ దారుణాలకు పాల్పడ్డారు. ఇప్పుడు పాపం పండింది కాబట్టి సిట్ ముందుకు వచ్చారు. ఈక ఈ రోజే వైవీ సుబ్బారెడ్డికి కూడా నోటీసులు ఇచ్చారు అధికారులు. ఈ నెల 13 ఆయన్ను విచారణకు పిలిచారు. ఆయన విచారణ తర్వాత అరెస్ట్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మరి ఆయన విచారణకు సహకరిస్తారా లేదంటే అడ్డదిడ్డంగా సమాధానాలు చెబుతారా అనేది మాత్రం తెలియాల్సి ఉంది.