YV Subbareddy : వై వి సుబ్బారెడ్డి కి నోటీసులు.. జగన్ ఇప్పుడు ఏమంటావ్..?
తిరుమల లడ్డు కల్తీ నెయ్యి కేసులో కీలక ముందడుగు పడింది. ఎన్ని రోజులు అందరూ అనుకున్నట్టుగానే ఈ కల్తీ నెయ్యి కేసులో వైవి సుబ్బారెడ్డి పాత్ర ఉన్నట్లు సుప్రీంకోర్టు నియమించిన సిట్ అనుమానించింది. ఇప్పటివరకు అసలు ఈ కల్తీ నెయ్యి కేసు ఉత్తదేయని.. ఇందులో తమ పాత్రలేదని తాము ఎలాంటి తప్పు చేయలేదని అత్యంత పవిత్రులం అన్నట్టు వైసిపి నేతలు ఎంత బిల్డప్ ఇచ్చారో మనం చూశాం. ఇక వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి తమకు ఎలాంటి సంబంధం లేదు అని చాలానే కవరింగులు ఇచ్చారు. కానీ ఇప్పుడు ఏమైంది. తిరుమల కల్తీ నెయ్యి కేసులో ఏకంగా వైవి సుబ్బారెడ్డికి సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు.
ఈనెల 13న విచారణకు రావాలంటూ ఆదేశించారు. ఈ నోటీసుల దెబ్బతో వైసిపి సైలెంట్ అయిపోయింది. ఇన్ని రోజులు ఇదంతా తప్పుడు కేసు అని తమ మీద కక్షతో చేస్తున్నారంటూ రకరకాల తప్పుడు ప్రచారాలు చేసింది వైసిపి. ఇక మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అయితే తన పార్టీ నేతలు అత్యంత పవిత్రమైన వారు అన్న రేంజ్ లో బిల్డప్ ఇచ్చారు.