టిడిపి నేతలకు సంక్రాంతి పండుగ వరకు గుడ్ న్యూస్ రాబోతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం పార్టీ కమిటీలపై అధిష్టానం దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఇప్పటికే కేంద్ర కమిటీతో పాటు పార్లమెంటరీ కమిటీలపై దృష్టి పెట్టారు. రీసెంట్ గానే పార్లమెంట్ కమిటీ అధ్యక్షులను పార్టీ నియమించింది. ఇప్పుడు మిగిలింది పార్లమెంట్ కమిటీలలో మెంబర్లు మాత్రమే. ప్రతి కమిటీలు 40 మందికి అవకాశం కల్పించాలని చంద్రబాబు, లోకేష్ భావిస్తున్నారు. ఇందులో ప్రధానంగా మహిళలకు పెద్దపీట వేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ మేరకు చాలామంది బయోడేటాలు కూడా చంద్రబాబు వద్దకు వెళ్లినట్టు సమాచారం. ఈ ఏడాది చివరికల్లా పార్లమెంటరీ కమిటీలు పూర్తి అయిపోతాయి.
ఇక మిగిలింది కేంద్ర కమిటీని నియమించడం మాత్రమే. పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నామినేటెడ్ పదవులపై సీనియర్లు, జూనియర్ లు చాలానే ఆశలు పెట్టుకున్నారు. కానీ నామినేటెడ్ పదవులు లిమిటెడ్ గా మాత్రమే ఉంటాయి. కాబట్టి అందరికీ అవకాశాలు రావు. అలా అవకాశాలు తక్కువగా ఉన్న నేతలు కేంద్ర కమిటీలో అవకాశం కోసం ఆశలు పెట్టుకుంటున్నారు. నామినేటెడ్ పదవి వస్తే ఓకే లేదంటే కేంద్ర కమిటీలో తమకు అవకాశం ఇవ్వాలని ఇప్పటికే చంద్రబాబు, లోకేష్ ను కలిసి వినతి పత్రాలు సమర్పించారు. దీనిపై చంద్రబాబు, లోకేష్ సుదీర్ఘంగా చర్చలు జరిపినట్టు తెలుస్తోంది.
పార్టీ భవిష్యత్తు, గత ఐదేళ్లలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ కోసం నిజాయితీగా పనిచేసిన వారిపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారంట. ఈసారి ఎక్కువగా జూనియర్లకు అవకాశాలు ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. కుదిరితే సీనియర్లకు నామినేటెడ్ పదవులు ఇచ్చి జూనియర్లను పార్టీలో కీలకంగా ఉంచాలని చూస్తున్నారంట. జూనియర్లకు అవకాశం ఇస్తే పార్టీ మరింత బలపడుతుందని భావిస్తున్నట్టు తెలుస్తోంది. యాక్టివ్ గా పని చేస్తున్న వారందరికీ ఈసారి అవకాశాలు రాబోతున్నాయంట. డబ్బున్నవారికి, పార్టీలో సీనియారిటీని ప్రాధాన్యంగా తీసుకోకుండా పార్టీ కోసం నిష్పక్షపాతంగా కష్టపడుతున్న వారికి అవకాశాలు వస్తాయంటున్నారు.