NSG TDP : టీడీపీ ఆఫీసులో ఎన్‌ఎస్‌జీ కమాండోలు..
NSG TDP : మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయాన్ని ఎన్‌ఎస్‌జీ టీమ్ పరిశీలించింది.;
NSG TDP : మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయాన్ని ఎన్‌ఎస్‌జీ టీమ్ పరిశీలించింది.. ఎన్‌ఎస్‌జీ డీఐజీ నేతృత్వంలోని బృందం పార్టీ ఆఫీసులోని ప్రతి రూమ్‌ను పరిశీలించింది.. ఇటీవల చంద్రబాబు పర్యటనలో తరచూ గొడవలు జరుగుతున్న నేపథ్యంలో ఆయన భద్రతపై ఎన్‌ఎస్‌జీ ప్రత్యేకంగా ఫోకస్ చేసిందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి.. అటు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, పోలీసుల నిర్లక్ష్యంపై.. అలాగే చంద్రబాబు భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఇప్పటికే కేంద్రానికి టీడీపీ నేతలు ఫిర్యాదులు చేశారు.. మరోవైపు ఉండవల్లిలోని చంద్రబాబు నివాసాన్ని ఎన్‌ఎస్‌జీ బృందం పరిశీలించింది.