NTR: చంద్రబాబుకు జరిగిన అవమానంపై జూ. ఎన్‌టీఆర్ స్పందన..
NTR: చంద్రబాబుకు జరిగిన అవమానంపై జూ. ఎన్‌టీఆర్ ట్విటర్ ద్వారా స్పందించారు.;
NTR (tv5news.in)
NTR: చంద్రబాబుకు జరిగిన అవమానంపై జూ. ఎన్‌టీఆర్ ట్విటర్ ద్వారా స్పందించారు. మాట మన వ్యక్తిత్వానికి ప్రమాణం అంటూ తన వీడియోను స్టార్ట్ చేశారు ఎన్‌టీఆర్. రాజకీయాల్లో విమర్శించుకోవడం మామూలే. కానీ అవి ప్రజల సమస్యల మీద ఉంటేనే మంచిది అని అన్నారు. విమర్శలైనా, దూషణలైనా వ్యక్తిగతంగా ఉండకూడదు అన్నారు.
ఏపీ అసెంబ్లీలో జరిగిన సంఘటన తన మనసును కలచివేసింది అన్నారు. ఆడపడుచుల గురించి పురుష పదజాలంతో మాట్లాడడం అరాచకపాలనకు నాంది పలుకుతుందన్నారు. స్త్రీలను గౌరవించడం మన రక్తంలో ఇమిడిపోయిన సంప్రదాయం అని అన్నారు. మన సంస్కృతిని కలచివేసి, కాల్చేసి రాబోయే తరానికి బంగారు బాట వేస్తున్నామనుకుంటే అది తప్పని చెప్పారు.
ఈ మాటలను తాను వ్యక్తిగత దూషణకు గురైన కుటుంబానికి చెందిన కుటుంబసభ్యుడిగా మాట్లాడట్లేదు.. ఈ మాటలను తాను ఓ కొడుకుగా, భర్తగా, తండ్రిగా, దేశానికి పౌరుడిగా, సాటి తెలుగువాడిగా మాట్లాడుతున్నాను అని అన్నారు. ఈ అరాచక సంస్కృతిని ఇక్కడితో ఆపేయాలని రాజకీయ నాయకులను కోరారు.
పోరాటం ప్రజా సమస్యలపై ఉండాలని, రాబోయే తరాలకు బంగారు బాట వేసేలా ఉండాలని,.. ఇది ఇక్కడితో ఆగిపోవాలని మనసారా కోరుకుంటున్నానని ఎన్‌టీఆర్ తన ట్విటర్ వీడియో ద్వారా చెప్పారు.
— Jr NTR (@tarak9999) November 20, 2021