Porus Chemical Factory: ఆరుగురిని బలితీసుకున్న పోరస్‌ కెమికల్‌ ఫ్యాక్టరీ మూసివేత..

Porus Chemical Factory: ఆరుగురుని బలితీసుకున్న ఏలూరు అక్కిరెడ్డిగూడెంలోని పోరస్‌ కెమికల్‌ ఫ్యాక్టరీకి తాళాలు పడ్డాయి

Update: 2022-04-15 14:15 GMT

Porus Chemical Factory: ఆరుగురు కార్మికులను బలితీసుకున్న ఏలూరు జిల్లా అక్కిరెడ్డిగూడెంలోని పోరస్‌ కెమికల్‌ ఫ్యాక్టరీకి తాళాలు పడ్డాయి.. పోరస్‌ ల్యాబొరేటరీ ఫ్యాక్టరీని మూసివేస్తూ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఉత్తర్వులు జారీ చేసింది.. నీటి కాలుష్య నివారణ చట్టం 1974లోని 33ఏ, గాలి కాలుష్య నివారణ చట్టం 1981ని అనుసరించి ఫ్యాక్టరీపై చర్యలు తీసుకుంటున్నట్లు బోర్డు స్పష్టం చేసింది.. ఇప్పటికే ఫ్యాక్టరీకి విద్యుత్‌ కనెక్షన్‌ తొలగించారు..

నిన్నటి అగ్ని ప్రమాదంలో ఆరుగురు మృతిచెందగా.. మరో 11 మంది పరిస్థితి విషమంగా ఉంది.. దీంతోపాటు పర్యావరణానికి కూడా నష్టం జరిగినట్లు అధికారులు నిర్ధారణకు వచ్చారు.. ప్రమాదం జరిగిన తర్వాత తనిఖీలు నిర్వహించిన కాలుష్య నియంత్రణ మండలి అధికారులు.. సీఎఫ్‌వో నిబంధనలు పాటించలేదని గుర్తించారు.. దీనివల్ల పరిసర ప్రాంతాలు కాలుష్యానికి గురైనట్లు గుర్తించారు.. ఫ్యాక్టరీలోని వ్యర్థాలను క్రమ పద్ధతిలో తొగించాలని ఆదేశాలు జారీ చేశారు.. ఇప్పటికే ఫ్యాక్టరీకి నోటీసులు జారీ చేశారు జిల్లా కలెక్టర్‌..

Tags:    

Similar News