AP CM : అమరావతి నిర్మాణం పూర్తయితే సినిమాలన్నీ ఇక్కడే : సీఎం బాబు హాట్ కామెంట్

Update: 2025-01-02 11:15 GMT

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం కల్పించిన అవకాశాల వలనే సినీ పరిశ్రమ అభివృద్ధి చెందిందని, సినిమాలకు ఇప్పుడు హైదరాబాద్ హబ్ గా మారిందని సీఎం నారా చంద్రబాబు తెలిపారు. అమరావతి నిర్మాణం పూర్తయితే ఇక సినిమాలన్నీ ఆంధ్రప్రదేశ్ లోనే అని అన్నారు. అమరావతిలో సినిమాలకు మంచి మార్కెట్ ఉంటుందని చెప్పారు. బుధవారం నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని పార్టీ కార్యాలయానికి వచ్చిన చంద్ర బాబు, మీడియా ప్రతినిధులతో తన చాంబర్లో కొద్దిసేపు ఇష్టాగోష్ఠి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో అనేక సమస్యలున్నాయని, 2024 చరిత్రాత్మక సంవత్సరమని అన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన ఈ 6 నెలల్లో రాష్ట్రాన్ని మళ్లీ గాడిలో పెడుతున్నామని, ప్రజల్లో కూడా తమ ప్రభుత్వం పట్ల నమ్మకం ఏర్పడిందన్నారు. నాలుగోసారి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తాను, ఎన్నడూ చూడని పరిస్థితిని ఇప్పుడు చూస్తున్నానని చెప్పారు. 1995లో అధికారులు తనతోపాటు ఉరుకులు, పరుగులు పెడుతూ ఉండేవారనీ.. ఇప్పుడు నిస్తేజంగా మారిపోయారని ఆవేదన వ్యక్తంచేశారు. గత ప్రభుత్వానికి భయపడి కొందరు అధికారులు తప్పులు చేశారని వ్యాఖ్యా నించారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందని, 94 కేంద్ర పథకాలను వినియోగించుకోకుండా నాశనం చేసిందని సీఎం చంద్రబాబు మండిపడ్డారు.

Tags:    

Similar News